బంజారాహిల్స్, జనవరి 25: ఎమ్మెల్యే కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్‌కు చెందిన లైఫ్‌స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని రామ్ నరేంద్ర గురువారం బంజారాహిల్స్ రోడ్ నం. 12లో ఓ ఆస్పత్రికి పని నిమిత్తం వచ్చారు. కారు డ్రైవర్ శ్రీనివాసులు యజమానిని ఆస్పత్రి వద్ద దింపిన అనంతరం అక్కడ పార్కింగ్ లేకపోవడంతో కొంచెం ముందుకెళ్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సమీపంలో రోడ్డుపక్కన నిలిపి..
కారులో కూర్చున్నాడు. ఇంతలో అతివేగంతో వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో శ్రీనివాసులుకు గాయమైంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కారు వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ది అని దర్యాప్తులో తేలింది.