CP Srinivas Reddy | జూబ్లీహిల్స్, మార్చి7: మహిళలు సాధిస్తున్న విజయాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉమెన్స్ డే వేడుకలను ప్రారంభించి.. ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్ అండ్ ఓ విక్రమ్ మాన్ సింగ్, జాయింట్ సీపీ (అడ్మిన్) జె.పరిమళ హనా నూతన్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ డి.కవిత, సీఎస్‌డబ్ల్యూ డీసీపీ రష్మీ పెరుమాల్, సీఏడీవో సుధారాణి, జేఏవో ఉర్మిళ, సూపరింటెండెంట్ జ్యోతి, మినీస్టీరియల్ సిబ్బంది, మహిళా పోలీసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.