సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు పెరిగాయి.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠం 30.5, కనిష్ఠం 21.0 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 54 శాతంగా నమోదైంది. రాగల 24 గంటల్లో ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.