Welfare schemes | సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానం : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
అంబర్‌పేట నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ జన్మదిన సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
అంబర్‌పేట,కాచిగూడ,గోల్నాక : అంబర్‌పేట నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ జన్మదిన సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
మంగళవారం అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా అంబర్‌పేట మున్సిపల్ దవాఖనాలో నిర్వహించిన సేవా కార్యక్రమానికి ఆయన హాజరై… రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు. అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన తెలిపారు.

కాచిగూడలో….
కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్ ఆధ్వర్యంలో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, సంక్షేమ పథకాల అమలుకర్త, భగీరధుడు తెలంగాణ తొలి సీఎం చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళవారం కాచిగూడ సీసీషరఫ్ ఆస్పత్రిలో 150 మంది రోగులకు పడ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు.. నింబోలిఅడ్డాలో జీహెచ్ఎంసీ సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం సీఎం కేసీఆర్ అని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని కోటి ఎకరాలకుపైగా నీరు అందుతుందని, దీంతో తెలంగాణ రైతుల కష్టాలు తుడుచుకుపోతాయని ఆయన వెల్లడించారు.

బాగ్‌అంబర్‌పేట డివిజన్లో..
బాగ్‌అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబర్‌పేట మున్సిపల్ దవాఖనాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీ రెడ్డి హాజరై.. రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సీఎం పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు డివిజన్ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

