ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 6 : ఉస్మానియా యూనివర్సిటీ(OU) కామర్స్ విభాగం ఈ నెల 16, 17 తేదీల్లో తెలంగాణ కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మీట్ – 2024(Commerce Post Graduates Meet) నిర్వహించనుంది. ఈ మేరకు విభాగం హెడ్ ప్రొఫెసర్ చెన్నప్ప ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మీట్లో భాగంగా వివిధ అంశాలలో ఇంటర్ యూనివర్సిటీ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
డేటా అనాలసిస్, వ్యాస రచన, జామ్, కేస్ స్టడీ, బిజినెస్ ప్లాన్, బిజినెస్ క్విజ్ వంటి అంశాలతో పాటు సోలో డ్యాన్స్, సింగింగ్, ఫేస్ పెయింటింగ్, గ్రూప్ డ్యాన్స్, యాడ్-మ్యాడ్ వంటి అంశాల్లో ఈ పోటీలు జరుగుతాయని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కళాశాల నుంచి గరిష్ఠంగా ఇరవై మంది విద్యార్థులను మాత్రమే ఒక్కో పోటీలో అనుమతిస్తామని పేర్కొన్నారు.