బంజారాహిల్స్‌లో విషాదం.. జర్మన్ ఫెఫర్డ్ నుంచి తప్పించుకునేందుకు యత్నించిన స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
Swiggy Delivery Boy | బంజారాహిల్స్‌లో విషాదం నెలకొంది. పెంపుడు కుక్క దాడి చేసేందుకు యత్నించడంతో.. దాన్నుంచి తప్పించుకునే క్రమంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన స్విగ్గీ బాయ్ నిమ్స్ ఆస్పత్రిలో
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో విషాదం నెలకొంది. పెంపుడు కుక్క దాడి చేసేందుకు యత్నించడంతో.. దాన్నుంచి తప్పించుకునే క్రమంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన స్విగ్గీ బాయ్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ (23) మూడేండ్లగా స్విగ్గీస్లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 9వ తేదీ రాత్రి పదిన్నర ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నం. 6, లుంబినీ రాక్ కాజిల్ అపార్ట్మెంట్స్లోని మూడో ఫ్లోర్లో ఉంటున్న శోభన నాగానికి ఫుడ్ పార్సల్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. ఫ్లాట్ వద్దకు వెళ్లి డోర్ కొట్టగానే.. లోపల నుంచి శోభనకు చెందిన జర్మన్ షెఫర్డ్ కుక్క అతడి మీదకు వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన రిజ్వాన్ కిందకు పరుగులు పెట్టాడు. ఈ క్రమంలో రెయిలింగ్ మీద నుంచి కిందపడిన రిజ్వాన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫ్లాట్ యజమాని శోభన స్థానికుల సాయంతో అతడిని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనకు కారణమైన శోభన నాగానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

