క్లబ్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి
నీకోసం నాదగ్గర ఒక పుట్టినరోజు బహుమతి ఉందంటూ అర్ధరాత్రి 12.30కు తన స్నేహితురాలికి వీడియోకాల్ చేసింది. మరుసటి రోజు తన పుట్టినరోజు అని తీసుకున్నానని చెప్పింది.
మెహిదీపట్నం, జూలై 3: నీకోసం నాదగ్గర ఒక పుట్టినరోజు బహుమతి ఉందంటూ అర్ధరాత్రి 12.30కు తన స్నేహితురాలికి వీడియోకాల్ చేసింది. మరుసటి రోజు తన పుట్టినరోజు అని తీసుకున్నానని చెప్పింది. ఆ తర్వాత హోటల్గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లంగర్‌హౌస్‌లోని ఒక హోటల్లో ఆత్మహత్య చేసుకున్న రేణుక అనే క్లబ్‌డాన్సర్ చివరి మాటలివి. ఇన్స్పెక్టర్ వెంకటరాములు తెలిపిన వివరాల ప్రకారం… పాతబస్తీ మూసాబౌలికి చెందిన రేణుక(26)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.
ఆమెకు ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. భర్తతో విడిపోయి ప్రస్తుతం బొల్లారంలో తన సోదరి వద్ద ఉంటుంది. కూకట్‌పల్లిలోని కింగ్స్క్వీన్స్ బార్లో డాన్సర్‌గా పనిచేస్తుండేది. గురువారం రాత్రి లంగర్‌హౌస్ ఫ్లోర్‌మిల్ సమీపంలో ఉన్న విగ్రాండ్ హోటల్‌కు ఫారూఖ్ అనే తన స్నేహితుడితో కలిసి వచ్చింది. హోటల్లోని ఐదో అంతస్తులో రూమ్ నెంబర్ 1611లో అర్ధరాత్రి వరకు ఇద్దరు కలిసి మద్యం తాగారు.
ఆ తర్వాత ఫారూఖ్ బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. కొద్ది సేపటికి వచ్చి చూడగా గదిలో రేణుక ఉరివేసుకుని కనిపించింది. దీంతో ఫారూఖ్ హోటల్ సిబ్బంది సహకారంతో లంగర్‌హౌస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా ఉరివేసుకునే ముందు తన స్నేహితురాలికి రేణుక వీడియో కాల్ చేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఫారూక్‌ను లంగర్‌హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

