సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం ఎంతో సందడిగా సాగిన సండే ఫన్ డేలో భారీ క్రికెట్ బ్యాట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. గిన్నీస్ రికార్డు పొందిన క్రికెట్ బ్యాట్‌ను ప్రభుత్వం శనివారం ట్యాంక్ బండ్‌పై ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచింది. దీంతో నగర వాసులు భారీ క్రికెట్ బ్యాట్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించారు. యువతీ, యువకులు క్రికెట్ బ్యాట్ ముందు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
దీనికితోడు ఆదివారం ఇండియా- పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండటం, సాయంత్రం వేళ కావడంతో సండే ఫన్ డేలో క్రికెట్ గురించి చర్చించుకున్నారు. హెచ్ఎండీఏ అధికారులు సండే ఫన్ డే కోసం షాపింగ్, ఫుడ్ స్టాల్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. నగర వాసులు ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సరదాగా కుటుంబ సభ్యులతో గడిపారు.