లివర్ క్యాన్సర్ రోగికి..
సిరోటిక్ లివర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక రోగికి స్టార్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. 55 ఏళ్ల రోగి గత కొంత కాలంగా సిరోటిక్ వ్యాధితో పాటు కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతోంది.
- స్టార్‌లో విజయవంతంగా కాలేయ మార్పిడి
సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సిరోటిక్ లివర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక రోగికి స్టార్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. 55 ఏళ్ల రోగి గత కొంత కాలంగా సిరోటిక్ వ్యాధితో పాటు కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతోంది. దీనితో రోగికి కాలేయంలో ఏర్పడిన క్యాన్సర్ కణితి పరిమాణం పెరిగి పోర్టల్ సిరలోకి విస్తరించిందని, ఈ పరిస్థితి కారణంగా రోగికి కాలేయ మార్పిడి చేయలేని క్లిష్ట పరిస్థితి ఎదురైనట్లు స్టార్ వైద్యులు తెలిపారు.
సమస్యను అధిగమించేందుకు రోగికి దశల వారీగా డౌన్స్టేజింగ్ పద్ధతిలో ఇమ్యునోథెరపిని ఆరు దశల్లో అందించామని వివరించారు. ఫలితంగా కణితి పరిమాణం తగ్గడంతోపాటు రక్తంలో ఫెటో ప్రొటీన్ స్థాయిలు కూడా సాధారణ స్థితికి చేరినట్లు వైద్యులు తెలిపారు. దీనివల్ల పరిస్థితులు అనుకూలంగా మారడంతో కాలేయ మార్పిడిని విజయవంతంగా జరిపినట్లు చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ హెపటబిలియరీ సర్జన్ డా.రాఘవేంద్ర బాబు, కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ అండ్ బీఎంటీ స్పెషలిస్టు డా.సంతోష్ కుమార్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

