Bandi Sai Bhageerath | ఓ బాలికపై లైంగిక దాడి ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి సాయి భగీరథ్ (Bandi Sai Bhageerath)పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సిట్ (SIT) చీఫ్ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ (Ritiraj Gaikwad)వేగవంతం చేసింది.
కాగా పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలంటూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ప్లాజా వద్ద విద్యార్థులు, సంఘ సంస్కర్తలు, స్వచ్చంద సంస్థల సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బండి భగీరథ్‌పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు : అడ్వకేట్ లలితా రెడ్డి
KTR | విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం.. నీట్ రద్దుపై కేటీఆర్