మెహిదీపట్నం : తెలంగాణ రాష్ట్ర ప్రధాత సీఎం కేసీఆర్,పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి ఠాకూర్ జీవన్‌సింగ్ అన్నారు. శుక్రవారం గోల్కొండ పోలీస్ స్టేషన్ అదనపు ఇన్స్పెక్టర్ మట్టంరాజుకు టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఠాకూర్ జీవన్‌సింగ్ రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా జీవన్‌సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోడూరి శ్రీధర్ సాగర్,సత్యనారాయణ,జబ్బార్,ముత్యాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.