Hyderabad | వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. శ్రీచైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు
Hyderabad | హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Hyderabad | హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
శ్రీచైతన్య విద్యాసంస్థలోని కిచెన్‌లో శుక్రవారం నాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇక్కడ వండే భోజనాన్ని హాస్టళ్లలోని వేల మంది విద్యార్థులకు రోజూ అందజేస్తున్నారు. వేల మందికి భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు.
సుమారు 125 కిలోల గడువు తీరిన(expired) ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు. కిచెన్, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు, కిచెన్‌ను సీజ్ చేయాలని, ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు అధికారులు మాదాపూర్(ఖానామెట్)లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

