జీహెచ్ఎంసీలో ప్రారంభమైన ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్
కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్| గ్రేటర్ హైదరాబాద్‌లో అందరికీ టీకాలే లక్ష్యంగా ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు సంయుక్తంగా ఈ ప్రక్రియ చేపట్టాయి. ఇందులో భాగంగా అర్హులైన అందరికి టీకా పంపిణీ చేయనున్నారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో అందరికీ టీకాలే లక్ష్యంగా ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు సంయుక్తంగా ఈ ప్రక్రియ చేపట్టాయి. ఇందులో భాగంగా అర్హులైన అందరికి టీకా పంపిణీ చేయనున్నారు. దీనికోసం ఇంటింటికి తిరుగుతూ వైద్యారోగ్య శాఖ సిబ్బంది వ్యాక్సినేషన్ స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారు. మొబైల్ వాహనాలతో వీధుల్లో తిరుగుతూ జీహెచ్ఎంసీ ప్రచారం నిర్వహిస్తున్నది. ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో వ్యాక్సినేషన్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చినవారితో మాట్లాడారు. కరోనా తొలి డోసును ఎందుకు వేసుకోలేదని అడిగి తెలుసుకున్నారు.
కాగా, ప్రత్యేక డ్రైవ్ కోసం మొత్తం 175 సంచార టీకా వాహనాలు ఏర్పాటు చేశారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 150 సంచార టీకా వాహనాలు.. కంటోన్మెంట్ పరిధిలో 25 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 4,846 కాలనీలు, బస్తీల్లో.. కంటోన్మెంట్ పరిధిలోని 360 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. నగరంలో ఇప్పటికే 18 ఏండ్లు నిండిన వారిలో 70 శాతానికిపైగా టీకా వేసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

