Foreign Ganja | గచ్చిబౌలిలో విదేశీ గంజా కలకలం.. అమ్ముతూ పట్టుబడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
హైదరాబాద్‌లో మరోసారి విదేశీ గంజాయి (Foreign Ganja) పట్టుబడింది. గచ్చిబౌలీలోని ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 170 గ్రాముల విదేశీ గంజాయి, 1 కిలో లోకల్ గంజాయి, బైకు, సెల్‌ఫోల్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నగరంలో మరోసారి విదేశీ గంజాయి (Foreign Ganja) పట్టుబడింది. గచ్చిబౌలీలోని ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 170 గ్రాముల విదేశీ గంజాయి, 1 కిలో లోకల్ గంజాయి, బైకు, సెల్‌ఫోల్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని బెంగళూరులోని డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ శివరామ్‌గా గుర్తించారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి గంజాయిని హైదరాబాద్‌కు అక్రమంగా తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అజయ్‌తో కలిసి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నారని చెప్పారు. ఇద్దరూ కలిసి ప్రతీ వారాంతంలో గంజాయి బిజినెస్ చేస్తున్నారని పేర్కొన్నారు. లోకల్ గంజాయిని బెంగళూరులో కొనుగోలుచేసి ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారని తెలిపారు. సినిమావాళ్లకు కూడా విదేశీ గంజాయి సరఫరా చేసినట్లు తెలుస్తున్నది. పరారీలో ఉన్న అజయ్‌ని గాలిస్తున్న పోలీసులు, ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే విషయమై కూపీ లాగుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

