Singer Sunitha | సింగర్ సునీత భర్తకు బెదిరింపులు.. నా నంబర్ బ్లాక్ చేస్తే నీ అంతు చూస్తానంటూ వార్నింగ్
Singer Sunitha | బంజారాహిల్స్ : సినీ నిర్మాతల మండలి సభ్యుడిని అంటూ పరిచయం చేసుకొని సింగర్ సునీత భర్త, పారిశ్రామిక వేత్త రామకృష్ణ వీరపనేని అలియాస్ రామ్‌ను బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Singer Sunitha | బంజారాహిల్స్ : సినీ నిర్మాతల మండలి సభ్యుడిని అంటూ పరిచయం చేసుకొని సింగర్ సునీత భర్త, పారిశ్రామిక వేత్త రామకృష్ణ వీరపనేని అలియాస్ రామ్‌ను బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డు నం.2లోని ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీలో నివాసముంటున్న వీరపనేని రామకృష్ణకు గత కొంతకాలంగా కేకే.లక్ష్మణ్ అనే వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు. తాను నిర్మాతల మండలి సభ్యుడినని, ముఖ్యమైన విషయంపై మాట్లాడాలంటూ కోరాడు. అయితే తాను బిజీగా ఉంటానని, ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఉంటే తన ఆఫీసుకు వెళ్లి సిబ్బందిని కలవాలని రామకృష్ణ సూచించాడు. అయితే నేరుగా కలవాల్సిందేనని, పలుమార్లు ఫోన్లు చేయడంతోపాటు వాట్సాప్ మెసేజీలు రావడంతో లక్ష్మణ్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లక్ష్మణ్ మరికొన్ని నంబర్లతో ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడం నీకే ప్రమాదమని.. నీ అంతుచూస్తానని బెదిరించడంతో విసిగిపోయిన వీరపనేని రామకృష్ణ శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితుడు కేకే.లక్ష్మణ్‌పై ఐపీసీ 506సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

