Balaram | ఇంగ్లీష్‌తో ఉజ్వల భవిష్యత్తు : సింగరేణి సీఎండీ బలరాం
Balaram | ఇంగ్లీష్ భాషను అందరూ కష్టపడి నేర్చుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సింగరేణి సీఎండీ బలరాం(Singareni CMD Balaram )అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 2: ఇంగ్లీష్ భాషను అందరూ కష్టపడి నేర్చుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సింగరేణి సీఎండీ బలరాం(Singareni CMD Balaram )అన్నారు. విద్యార్థులు ప్రపంచ యవనికపై రాణించాలంటే భాషా నైపుణ్యం అత్యంత కీలకమని చెప్పారు. విద్యార్థులు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడం ద్వారా ఆయా రంగాల్లో రాణించేందుకు సులువవుతుందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ (ఈఎల్టీసీ) ద్వారా గిరిజన విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ఆదివారం ముగిసింది. విద్యార్థులకు ఓయూలో నెలరోజుల పాటు వసతి కల్పించి, శిక్షణ అందించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యాభివృద్ధికి, లైబ్రెరీల ఏర్పాటుకు సింగరేణి తరపున ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలకు కూడా విద్యాభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తామన్నారు. అన్ని సమస్యలకు విద్య మాత్రమే పరిష్కారం చూపుతుందని అన్నారు. సాధికారత సాధించేందుకు సుస్థిర విద్యాభివృద్ధి ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఈఎల్టీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ, కార్యక్రమ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ సవిన్ సౌడ, ప్రొఫెసర్ క్రిస్టోఫర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశిం, ప్రొఫెసర్ పరిమళ కులకర్ణి, డాక్టర్ మాధవి, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

