సాయన్నకు ప్రముఖుల నివాళి
కంటోన్మెంట్ శాసన సభ్యుడు జ్ఞాని సాయన్న(72) ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల కిందట నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు.
- పార్థివ దేహాన్ని సందర్శించి.. కుటుంబ సభ్యులకు
- మనోధైర్యం నింపిన సీఎం కేసీఆర్
- నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు
- నేడు మధ్యాహ్నం మారేడ్‌పల్లిలో అంత్యక్రియలు
ముషీరాబాద్/చిక్కడపల్లి, ఫిబ్రవరి 19 : కంటోన్మెంట్ శాసన సభ్యుడు జ్ఞాని సాయన్న(72) ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల కిందట నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. సాయన్న మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అశోక్‌నగర్‌లోని ఆయన నివాసానికి తరలివచ్చి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాయన్న మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అశోక్‌నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చి సాయన్న పార్థివ దేహానికి నివాళులర్పించారు.
అనంతరం సాయన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, అరెకపూడి గాంధీ, కాలేరు వెంకటేశ్, బాల్క సుమన్, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం, కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజీవ్‌సాగర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి ఎస్.వేణుగోపాలాచారి, టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఏపీ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పిడమర్తి రవి, మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్రావు, అంజన్‌కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు తలసాని సాయికిరణ్ యాదవ్, ఎంఎన్ శ్రీనివాసరావు, ప్రజాగాయకుడు గద్దర్ సాయన్న పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
నేడు ప్రజల సందర్శనార్థం..
ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి సోమవారం(నేటి) మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలు, అభిమానుల సందర్శనార్థం కార్ఖానలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పార్థివ దేహాన్ని తరలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మారేడ్‌పల్లి హిందూ శ్మశాన వాటికకు తరలించి అక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సంతాపం తెలిపిన మంత్రి మల్లారెడ్డి
ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రతి నిత్యం ప్రజల కోసమే.. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాయన్న ప్రజా నాయకుడు అని, ప్రతి నిత్యం ప్రజల కోసమే ఆలోచించే వాడని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు.
సాయన్న మృతి.. తీరని లోటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నిత్యం ప్రజా సమస్యల కోసమే ఎమ్మెల్యే సాయన్న పోరాడారని మంత్రి తలసాని పేర్కొన్నారు. సాయన్న మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా.. ప్రజల కోసం పనిచేశారని తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సాయన్న రాజకీయాల్లో అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందారని అన్నారు. ఎంతో అప్యాయంగా పలకరించే వారిని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తమకు ప్రత్యేక అనుబంధం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి బీఆర్ఎస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా తనకు తీరని లోటని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే సాయన్న మరణవార్తను తెలుసుకున్న ఎమ్మెల్యే మాగంటి ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని, టీడీపీలో ఉన్నప్పటినుంచి సాయన్నతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించాలని భగవంతుడిని కోరుకుంటున్నామన్నారు.
ఆత్మకు శాంతి చేకూరాలి మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మృతి బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సాయన్న.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కంటోన్మెంట్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సాయన్న గుండెపోటుతో తదిశ్వాస విడవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ… కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

