సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దళితుల స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో ఇప్పటికీ 60 నుంచి 70శాతం వరకు లబ్ధిదారులు వాహనాలనే కొనుగోలు చేశారు. దీంతో ఒకే రంగంలోని యూనిట్లను ఎంపిక చేసుకోవడంతో లబ్ధిదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఫలితంగా ఉపాధి పొందలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) ప్రతినిధులు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారుల చొరవతో లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ యూనిట్లపై అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలను నెలకొల్పేందుకు సూచనలు చేయగా, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్యాసింజర్ అండ్ గూడ్స్ (ట్రాన్స్‌పోర్టు), ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీసింగ్ యూనిట్, ఆటోరిక్షా-ప్యాసింజర్ ఆటో, బిల్డింగ్ మెటీరియల్ స్టోర్/హార్ట్‌వేర్ షాప్, కార్ ట్యాక్సీ (ట్రాన్స్పోర్ట్) లాంటి యూనిట్లతో పాటు కంప్యూటర్, డిజిటల్ ఫొటోగ్రఫీ (విత్ డ్రోన్) లాంటి వాటిలో ఎక్కువగా ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో ఆహారపు ఉత్పత్తుల పరిశ్రమల (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు)ను నెలకొల్పితే ఫలితాలు ఉంటాయని వివరించినట్లు పేర్కొన్నారు.
శుక్రవారం యూసుఫ్‌గూడ డివిజన్లో దళిత బంధు పథకం కింద మంజూరైన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ యంత్రాన్ని లబ్ధిదారు రేణుకకు అందజేస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్
పట్టణ ప్రాంతాల్లో..
కొన్ని జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో డీటీపీ, మీసేవా, సీఎస్సీ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అండ్ ఫొటో స్టూడియో, ఎలక్ట్రికల్ దుకాణం అండ్ బ్యాటరీ సర్వీసెస్, ఎలక్ట్రానిక్ గూడ్స్ షోరూం, ఫ్లెక్సి, డిజిటల్ ప్రింటింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ రెస్టారెంట్, హార్ట్‌వేర్ అండ్ స్టేషనరీ మార్ట్ లాంటి యూనిట్లు పెడితే నిత్యం ఉపాధి లభించడంతో పాటు ఆర్థికంగా తమకుతాముగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి ఒక్కో నియోజకవర్గంలోని 100 యూనిట్లు టార్గెట్ పెట్టుకోగా.. నూటికి నూరు శాతం పూర్తిచేశారు. జూబ్లీహిల్స్, సనత్‌నగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ (కొంత ప్రాంతం)లో పెట్టుకున్న టార్గెట్లు సైతం పూర్తయ్యాయి. లబ్ధిదారులకు మొదటి దఫాలో ఎక్కువ మొత్తంలో వాహనాలే అందజేశారు. వాహనాలు పట్టణ ప్రాంతంలోని వారికి అనుకూలంగా ఉండటంతో ప్రస్తుతం ప్రత్యామ్నాయ యూనిట్ల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు.
వాహనాలవైపే ఎక్కువ మంది మొగ్గు
ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో దళిత వర్గాల స్వావలంబన కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం విజయవంతంగా అమలవుతున్నది. మొదటి దఫా అందరూ వాహన యూనిట్లనే ఎంచుకున్నారు. దీంతో ఉపాధి పొందడం కష్టంగా మారింది. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) ఆధ్వర్యంలో ఎస్సీ సంక్షేమ శాఖ సహకారంతో ప్రత్యామ్నాయ యూనిట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై ఆయా కలెక్టరేట్ల ప్రాంగణాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యామ్నాయ యూనిట్లే ఫలితాలనిస్తాయి. – నారాయణ దాసరి, కోఆర్డినేటర్, డిక్కీ
ఇవే ప్రత్యామ్నాయ యూనిట్లు..
ఒకే ఊరు, ఒకే ప్రాంతంలోని లబ్ధిదారులు ఒకే రకమైన యూనిట్లు ఎంపిక చేసుకుంటే.. వాటితో ఉపాధి పొందడం కష్టంగా మారుతుందని డిక్కీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అనేక జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కోసం పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇటు అధికారులు, అటు డిక్కీ ప్రతినిధులు ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. లబ్ధిదారులు ప్రత్యామ్నాయ యూనిట్లు పొందితేనే ఆర్థికంగా త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
1. వాహనాలు (ప్యాసింజర్ అండ్ గూడ్స్ ట్రాన్స్‌పోర్టు)
2. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీసింగ్ యూనిట్
3. ఆటోరిక్షా-ప్యాసింజర్ ఆటో
4. బిల్డింగ్ మెటీరియల్ స్టోర్/హార్ట్‌వేర్ షాప్
5. కార్ ట్యాక్సీ (ట్రాన్స్పోర్ట్)
6. సిమెంట్/స్టీల్ (సబ్ డీలర్షిప్) దుకాణం
7. సిమెంట్ బ్రిక్స్ తయారీ/రింగ్స్
8. సెంట్రింగ్ /రూఫ్ మేకింగ్ యూనిట్ (స్టీల్ అండ్ ఉడెన్/కాంక్ట్రీట్ మిక్సర్ యూనిట్ (రెడీ మిక్స్)
9. ఫోమ్ వాష్ (కార్)
10. క్లాత్ ఎంపోరియం/టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్ గార్మెంట్స్ షోరూం
11. సీఎన్సీ/ లేట్ మిషిన్లు
12. సైకిల్ షోరూం అండ్ రిపేర్ సెంటర్
13. డెంటల్ క్లినిక్
14. డయాగ్నొస్టిక్ ల్యాబ్/మెడికల్ షాప్
15. డిజిటల్ నెట్వర్క్
16. డిజిటల్ ఫొటో స్టూడియో అండ్ ల్యాబ్
17. డీటీపీ, మీసేవా, సీఎస్సీ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అండ్ ఫొటో స్టూడియో
18. ఎలక్ట్రికల్ దుకాణం అండ్ బ్యాటరీ సెల్స్/ సర్వీసెస్
19. ఎలక్ట్రానిక్ గూడ్స్ షోరూం (సేల్స్/సర్వీసెస్)
20. ఫ్లెక్సి/డిజిటల్ ప్రింటింగ్
21. ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూషన్
22. ఫుడ్ అండ్ బేవరేజ్ రెస్టారెంట్
23. హార్ట్‌వేర్ అండ్ స్టేషనరీ మార్ట్
24. హోటల్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ (దాబా)
25. ఐరన్ గేట్స్ అండ్ గ్రిల్స్ తయారీ యూనిట్
26. జేసీబీ
27. లేడీస్ ఎంపోరియం అండ్ ఎంబ్రాయిడరీ/టైలరింగ్
28. మెడికల్ అండ్ జనరల్ స్టోర్
29. మినీ డైరీ యూనిట్
30. మినీ సూపర్ మార్కెట్
31. మొబైల్ టిఫిన్ సెంటర్ (ఫోర్ వీలర్)
32. మల్టీటైప్ లెదర్ గూడ్స్ (ఫుట్‌వేర్ షాప్)
33. ఆయిల్ మిల్, రైస్, పిండి మిల్స్ (వెట్ గ్రైండర్)
34. పేపర్ ప్లేట్స్/గ్లాసెస్/బ్యాగ్స్ ఉత్పత్తుల యూనిట్
35. ప్లాస్టిక్ మౌల్డింగ్ మిషినరీ
36. ప్లాస్టిక్ ట్రేడింగ్
37. పౌల్ట్రీ ఫార్మింగ్ (బాయిలర్/నాటుకోళ్లు)
38. టెంట్ హౌస్, డెకరేషన్ లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్
39. ట్రాక్టర్ అండ్ ట్రాలీ
40. వెజిటేబుల్ క్రేట్ మోల్డ్
41. వీడియోగ్రఫీ అండ్ ఫొటోగ్రఫీ (డ్రోన్ కెమెరాతో సహా)
42. బ్యూటీపార్లర్
43. హార్డ్‌వేర్/ైప్లెవుడ్/ పెయింట్/ శానిటరీ మార్ట్ అండ్ ఆటో
44. ఫుట్‌వేర్ షాప్ మల్టీటైప్ లెదర్ గూడ్స్
45. రెసిడెన్షియల్ స్కూల్స్/హాస్టల్స్‌కు ఫుడ్ అండ్ వెజిటేబుల్ ఐటమ్స్ సైప్లె+ 2 ఆటోట్రాలీస్
46. స్టేషనరీ అండ్ బుక్ స్టోర్
47. ఫర్నీచర్/కార్పెంటర్/ఉడ్వర్క్స్
48. ఫోర్‌వీలర్/హెవీ వెహికల్ (గూడ్స్ ట్రాన్స్పోర్ట్)
49. రైస్ దుకాణం
50. స్టీల్/అల్యూమినియం/సిమెంట్ దుకాణం
51. బేకరీ/మిఠాయి దుకాణం/కూల్ డ్రింక్/జ్యూస్ సెంటర్