రూ. 10 కోట్ల వ్యయంతో ఈఎస్ఐ శ్మశానవాటిక అభివృద్ధి
సనత్‌నగర్ ఈఎస్ఐ శ్మశానవాటికను రూ. 10 కోట్ల వ్యయంతో నగరంలోని మహా ప్రస్థానం కంటే అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.
- మంత్రి తలసాని శ్రీనివాస్
అమీర్‌పేట్, ఏప్రిల్ 24 : సనత్‌నగర్ ఈఎస్ఐ శ్మశానవాటికను రూ. 10 కోట్ల వ్యయంతో నగరంలోని మహా ప్రస్థానం కంటే అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం అమీర్‌పేట్ డివిజన్లోని ఈఎస్ఐ శ్మశానవాటిక, దివ్యశక్తి అపార్ట్మెంట్స్ సమీపంలోని నాలాలను మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ సీఈ జియాఉద్దీన్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్‌లతో కలిసి సందర్శించారు. ముందుగా ఈఎస్ఐ శ్మశానవాటికను సందర్శించిన మంత్రికి అక్కడ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు మ్యాప్ ద్వారా చూపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఈఎస్ఐ శ్మశానవాటికను మహా ప్రస్థానం తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను పది రోజుల్లోగా రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అమీర్‌పేట్ దివ్యశక్తి అపార్ట్మెంట్స్ సమీపంలోని నాలాలో పేరుకుపోయిన పూడికలతో నీరు సాఫీగా పారడం లేదంటూ స్థానికులు మంత్రి తలసానికి చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ..నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించి, నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, ఎం.హనుమంతరావు, దివ్యశక్తి అపార్ట్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శ్యామ్‌సుందర్, సునీత, జోనల్ కమిషనర్ రవికిరణ్, జలమండలి జీఎం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

