రైస్ రేట్ రైజింగ్
బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానుసారం ధరలు పెంచుతున్నా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. పౌరసరఫరాల అధికారులు ముందస్తుగానే ధరల నియంత్రణను అదుపులో ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముందుగానే మేల్కోకపోవడం వల్లే కృత్రిమ పెరుగుదలకు కారణమైంది. ధరలు క్రమంగా పెరుగుతున్నప్పుడు చడీ చప్పుడు లేకుండా ఉండి..
- బియ్యం ధరలకు రెక్కలు
- సామాన్యుడికి చుక్కలు
- క్వింటా సన్నబియ్యం ధర రూ.8 వేల నుంచి రూ.10 వేలు
సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. కాంగ్రెస్ రాజ్యంలో… అన్నట్లు ఉన్నాయి నగరంలోని పరిస్థితులు. బహిరంగ మార్కెట్లో ఏ వస్తువు కొందామన్నా ధరలు మండిపోతున్నాయి. నిత్యావసరాల్లో ప్రధానమైన బియ్యం ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా బియ్యం ధర రూ.10 వేల మార్కును దాటిపోతున్నది. ఎంత కరువు పరిస్థితులు ఏర్పడినా.. ఇంత పెద్ద మొత్తంలో మునుపెన్నడూ పెరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా వరికోతలు పూర్తి కాలేదు. కొన్ని ప్రాంతాల్లో కోతలు పూర్తయి ఇప్పుడిప్పుడే పంట మార్కెట్లోకి వస్తున్నది. కానీ ఎల్‌నినో పేరు చెప్పుకొని బహిరంగ మార్కెట్లో వ్యాపారులు బియ్యం ధరలను ఇష్టానుసారం అమాంతం పెంచేస్తున్నారు. దీంతో క్వింటా సన్న రకం బియ్యం ధర రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా పలుకుతున్నది. గతంలో క్వింటా రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ఉండేది. ఇప్పటికే బియ్యం ధర గతం కంటే రెట్టింపు చేసి విక్రయిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి భారీగా తగ్గనున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పౌర సరఫరాల అధికారులు బియ్యం వ్యాపారులపై దృష్టి సారించి ధరల పెరుగుదలను కట్టడి చేయాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. –
ధరల నియంత్రణలో విఫలం
బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానుసారం ధరలు పెంచుతున్నా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. పౌరసరఫరాల అధికారులు ముందస్తుగానే ధరల నియంత్రణను అదుపులో ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముందుగానే మేల్కోకపోవడం వల్లే కృత్రిమ పెరుగుదలకు కారణమైంది. ధరలు క్రమంగా పెరుగుతున్నప్పుడు చడీ చప్పుడు లేకుండా ఉండి.. ఇప్పుడు రెట్టింపు అయ్యాక తనిఖీల పేరిట హడావుడి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిమాండ్ గతంలో మాదిరిగానే ఉన్నప్పటికీ ధరలు వేగంగా పెంచుతూ.. వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తుంటే నోరు మెదపకుండా ఉండి.. ఇప్పుడు తనిఖీలు, ఆకస్మిక దాడుల పేరిట హడావుడి చేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు చేసినా..అధిక ధరలను తగ్గించాలని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేయకుండా కేవలం స్టాక్ డీటెయిల్స్ మాత్రమే చూసి వస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ధరలను ఏ కారణం లేకుండా కేవలం ఎల్‌నినో ప్రభావాన్ని బూచిగా చూపుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోకపోవడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజుల్లో మరింత పెంచే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే పెరిగిన ధరలను తగ్గించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో సామాన్యుడిపై మోయలేని భారం పడుతున్నది. బియ్యానికి గతం కంటే రెట్టింపు ధర కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులు, దినసరి కూలీలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. కేవలం బియ్యానికే రూ.10 వేల దాకా వెచ్చించాలంటే.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్య ప్రజలపై బియ్యం ధరలు గుదిబండలా మారాయి. నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసరాలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయి. దానికి తోడు బియ్యం ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు మరింత భారంగా మారుతున్నది. వేతన జీవులు తమకు వచ్చే నెలసరి ఆదాయంలో సగం బియ్యానికే ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీని ప్రభావం ఆర్థికంగా కుంగదీస్తున్నది. నెలంతా కష్టపడి పనిచేసిన దినసరి కూలీలకు బియ్యం కొందామంటేనే జంకే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పంటలు చేతికొచ్చిన తర్వాత దిగుబడిని బట్టి పెరగాల్సిన ధరలు ముందుగానే పెరగడంతో భవిష్యత్‌లో మరింత భారం పడనున్నదని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు తాము ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో అమలుకాని ఆదేశాలు
మేడ్చల్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలన్న ఆదేశాలు మేడ్చల్ జిల్లాలో అమలు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రైస్ మిల్లర్లు, రైస్ ట్రెడర్లు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, రిటైలర్లు నిర్ణయించిన గరిష్ఠ ధరలకు మించకుండా బియ్యం విక్రయించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. వినియోగదారుల నుంచి నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తన్ని వసూళ్లు చేయవద్దని వ్యాపారులకు హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రతి రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులు తప్పని సరిగా ఆదేశాలు పాటించడంతోపాటు వారి దుకాణాల్లో బియ్యం ధరలను ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో తెలంగాణ బీపీటీ బియ్యం కిలో రూ. 66, తెలంగాణ సోనా బియ్యం కిలో రూ. 74, తెలంగాణ శ్రీరామ గోల్డ్ బియ్యం కిలో రూ.79 లకు విక్రయించేలా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేలా చూడాలని ప్రజలు అధికారులకు విజ్ఞాప్తి చేస్తున్నారు. కాగా, వ్యాపారులు రూ. 85 నుంచి రూ. 97 వరకు విక్రయిస్తున్నట్లు వినియోగదారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
పౌర సరఫరాల శాఖ నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. బియ్యం ధరల పట్టికు ఏర్పాటు చేసి వినియోగదారులకు ఇబ్బందుల రాకుండా చూసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. లోటు వర్షపాతం నమోదు కారణంగా వానకాలం సీజన్లో వరి పంటలు తక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నందున కొందరు వ్యాపారులు బియ్యాన్ని నిల్వ చేసుకుని కృత్రిమంగా బియ్యం కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కృత్రిమ కొరత సృష్టించి బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

