అధిక ధరలకు రెమిడెసివిర్.. 8 మంది అరెస్ట్

కేపీహెచ్‌బీ కాలనీ/ఉప్పల్, మే 6 : ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జి.వి.సాగర్(30) కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటూ.. మంజీరామాల్లోని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
కొవిడ్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకున్న సాగర్ అధిక ధరలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో మంజీరామాల్లోని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్‌లో పోలీసులు తనిఖీ చేయగా.. ఇంజక్షన్లను విక్రయిన్న సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌తో పాటు బైక్, సెల్‌ఫోన్, ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
- నిజాంపేటలో నివాసముండే ఒంగోలు సుబ్బారావు (28) కేపీహెచ్‌బీ కాలనీలోని రవి వైద్యశాలలో పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను అధిక ధరలకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఒక రెమ్డిసివిర్ ఇంజక్షన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
- బోడుప్పల్ ఫీర్జాదిగూడ ప్రాంతానికి చెందిన వినీత్(26) నాచారం ప్రాంతంలో అధిక ధరలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. సాగర్, సుబ్బారావును కేపీహెచ్‌బీ పోలీసులు, వినీత్‌ను నాచారం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
- గుడిమల్కాపూర్‌కు చెందిన నిఖిల్ అగర్వాల్ ధరణి మెడికల్ షాప్ పేరుతో ఫార్మసీ వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరు మైనర్ల సహకారంతో ఒక్కో రెమిడిస్వేర్ ఇంజక్షన్‌ను రూ.30 వేలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేసి స్వైపింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
- చర్లపల్లి: కుషాయిగూడలో రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్ల్లాక్లో విక్రయిస్తున్న సత్యనారాయణ శర్మ, సృజన్కృష్ణను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 ఇంజక్షన్లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

