ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 28 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, ఫిలాసఫీ, తెలుగు తదితర విభాగాలలో ఎంఏ, ఎమ్మెస్సీ మేథమేటిక్స్ కోర్సులతో పాటు సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జెనిటిక్స్, ఫుడ్ టెక్నాలజీ తదితర విభాగాల ప్రీ పీహెచ్డీ (పీహెచ్డీ కోర్స్వర్క్) పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.