భవన నిర్మాణ వ్యర్థాలపై ఫోకస్
భవన నిర్మాణ, కూల్చివేసిన నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేని ప్రదేశాల్లో ఇష్టా రాజ్యంగా వేసిన పక్షంలో చట్టరీత్యా చర్యలకు వెనుకాడకూడదని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు.
- ఫోన్ చేస్తే ఇంటికొచ్చి తీసుకెళ్తాం
- నగరం నలువైపులా రీసైక్లింగ్ ప్లాంట్లు
- ఎక్కడపడితే అక్కడ పారబోస్తే చట్టరీత్యా చర్యలు
- అధికారులకు కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలు
సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ, కూల్చివేసిన నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేని ప్రదేశాల్లో ఇష్టా రాజ్యంగా వేసిన పక్షంలో చట్టరీత్యా చర్యలకు వెనుకాడకూడదని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. మెహిదీపట్నం సరిల్లోని పలు కాలనీలలో పర్యటించిన కమిషనర్ శానిటేషన్, అభివృద్ధి పనులను సోమవారం పర్యవేక్షించారు. భవన నిర్మాణ, కూల్చి వేసిన వ్యర్థాల ను రోడ్డు, పుట్ పాత్, నాలాలు, చెరువులు, అనుమతి లేని ప్రదేశాల్లో వ్యర్థాలను వేసిన పక్షంలో జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం జరిమానాతో పాటు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సీ అండ్ డీ రీసైక్లింగ్ ప్లాంట్లను హైదరాబాద్ నలువైపులా ఫతుల్లాగూడ, మలాజిగిరి, శంషాబాద్, తూముకుంటల లో ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వివరించారు. ఒకొ క ప్లాంట్‌కు కొన్ని సరిళ్లను కేటాయించినట్లు అవసరమైన వారు ప్లాంట్ వారికి సంప్రదిస్తే వారు తీసుకుని వెళ్తారని కమిషనర్ తెలిపారు.
ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్లే.. సౌలతు
ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మెహిదీపట్నం, కార్వా న్, గోషామహల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ సరిల్తో పాటు, చార్మినార్ జోనల్లో చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, అల్వా ల్, సికింద్రాబాద్ జోన్లో మలాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట సరిల్ నిర్మాణ వ్యర్థాలు సేకరణకు తూంకుంట, శంషాబాద్ ప్లాంట్ సంబంధించిన వాట్సాప్ నం: 73300 00203ను సంప్రదించాలని, లేదా టోల్ ఫ్రీ నం: 1800-203-0033కు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి వ్యర్థాలను తీసుకొని వెళ్తారని కమిషనర్ తెలిపారు. అదే విధంగా కూకట్పల్లి జోన్లో మూసాపేట్, కూకట్పల్లి, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, శేరి లింగంపల్లి జోన్ యూసుఫ్‌గూడ, చందానగర్ శేరి లింగంపల్లి, ఆర్సీ పురం సరిల్లకు, సికింద్రాబాద్ జో న్ అంబర్పేట్, ఎల్బీ నగర్ జోన్లో ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, చార్మినార్ జోన్లో మలక్‌పేట్, సంతోష్ నగర్ సరిల్లలో ఫతుల్లాగూడ, జీడిమెట్ల ప్లాంట్లకు సంబంధించిన వాట్సాప్ నం: 9100 927 073కు గాని టోల్ ఫ్రీ నం: 1800- 120 – 1159 కు కాల్ చేస్తే వారు తమ ఇంటికి వచ్చి తీసుకు వెళ్తారని పేర్కొన్నా రు. ఇందుకు టన్నుకు జీహెచ్ఎం సీ నిర్ణయించిన రుసుం చెల్లించా ల్సి ఉంటుందని కమిషనర్ తెలిపారు.
ప్రజలు సహకరించాలి
నగరాన్ని పరిశుభ్రంగా ఉం చేందుకు నగర వాసులు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ విషయంలో క్షేత్ర స్థాయి అధికారులు కార్పొరేటర్లు ప్రజలకు వివరించాలని కోరారు. అంతే కాకుండా భవన నిర్మాణ వ్యర్థాల ను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను కూడా పట్టుకుని సీజ్ చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మెహిదీపట్నం సరి ల్ శ్రీనగర్, పిల్లర్ నం:55, విజయనగర్ కాలనీ, సె యింట్ ఆన్స్ సూల్, ఎన్ఎండీసీ రోడ్, చాచా నెహ్రూ పార్, హామీ దా నగర్, ముస్లిం శ్మశాన వాటికలను పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ వ్యర్థాలు, సీసీ రోడ్డు పనులను, పాన్ షాపు వద్దకు వెళ్లి ఎలాంటి వ్యర్థాలను వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలని యజమాని కోరారు. అదే విధంగా పలు ప్రదేశాల్లో శానిటేషన్ పనులను పరిశీలించిన కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రే, డిప్యూటీ కమిషనర్ సూర్య ప్రకాష్, ఏఎంహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

