భవన నిర్మాణ వ్యర్థాలు తిరిగి ఉపయోగంలోకి

- స్వచ్ఛ హైదరాబాద్ దిశగా..
- నాగోలు ఫతుల్లాగూడలో రీ సైక్లింగ్ ప్లాంట్
- నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- నిత్యం 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్
- 95% మేర పునర్వినియోగం ఫుట్‌పాత్, ఫ్లోరింగ్ నిర్మాణాల్లో వాడకం
పురాతన భవనాల కూల్చివేత, ఇండ్ల మరమ్మతుల సమయంలో వ్యర్థాలు పోగవుతుంటాయి. వీటిని ఏం చేయాలో తెల్వక చాలామంది గుట్టుచప్పుడు కాకుండా చెరువుల వద్ద, రోడ్ల వెంట పారబోస్తారు. దీన్ని నియంత్రించేందుకు బల్దియా తక్కువ రుసుముతో ఇంటి నుంచే వ్యర్థాల సేకరణ ప్రారంభించింది. ఇలా సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు ఆధునిక హంగులతో జీడిమెట్లలో ప్లాంట్ ఏర్పాటు చేయగా, రెండోది నాగోలు సమీపంలోని ఫతుల్లాగూడ వద్ద నిర్మించారు. నిత్యం 500 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే ఈ అధునాతన ప్లాంట్‌ను శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. వెబ్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్లాంట్‌లో దుమ్ము, ధూళి బయటకు రాకపోవడం దీని ప్రత్యేకత.
95 శాతం పునర్వినియోగం
ఫతుల్లాగూడ ప్లాంట్‌లో నిత్యం 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. దీనిద్వారా వచ్చిన సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర, రాయి, ఇటుకలను వేరుచేసి పేవర్‌బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్‌పాత్ టైల్స్ వంటివి తయారు చేస్తారు. ఈ టైల్స్ అత్యంత నాణ్యమైనవి. ధర కూడా బయటతో పోల్చితే 30 శాతం తక్కువ. ఈ సామగ్రిని ఫుట్‌పాత్, ఫ్లోరింగ్ పనుల్లో వినియోగిస్తారు.
ఇంటి వద్దే సేకరణ
నగరంలో నిత్యం దాదాపు 2 వేల టన్నులకుపైగా నిర్మాణ వ్యర్థాలు వెలువడుతుంటాయి. వీటిని ఎక్కడపడితే అక్కడ పారబోయకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసింది. టన్ను వ్యర్థానికి రూ.342 చెల్లిస్తే ఇంటి వద్దకే వాహనం వచ్చి తీసుకెళ్లుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- recycling
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

