ఉస్మానియాలో రికార్డులు మాయం!
ఉస్మానియా దవాఖాన కేంద్రంగా జరుగుతున్న కారుణ్య నియామకాల దందాపై వస్తున్న ఆరోపణలతో అక్రమార్కులు అప్రమత్తమయ్యారు. కారుణ్య దందాపై శుక్రవారం ‘నమస్తే’లో వచ్చిన వార్తా కథనంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సంబంధిత రికార్డులను తారుమారు చేసేందుకు యత్నించినట్లు విశ్వసనీయ సమాచారం.
-
కారుణ్య నియామకాల దందాపై నమస్తేలో కథనం
-
అప్రమత్తమైన అక్రమార్కులు.. రికార్డులు మాయం చేసే కుట్ర
-
దర్యాప్తునకు సాహసించని యంత్రాంగం
సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖాన కేంద్రంగా జరుగుతున్న కారుణ్య నియామకాల దందాపై వస్తున్న ఆరోపణలతో అక్రమార్కులు అప్రమత్తమయ్యారు. కారుణ్య దందాపై శుక్రవారం ‘నమస్తే’లో వచ్చిన వార్తా కథనంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సంబంధిత రికార్డులను తారుమారు చేసేందుకు యత్నించినట్లు విశ్వసనీయ సమాచారం. ఉస్మానియా మెడికల్ రికార్ట్ టెక్నీషియన్(ఎంఆర్టీ), ఇన్చార్జ్ మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్(ఎంఆర్ఒ)పై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ ఫిర్యాదులపై అటు దవాఖాన సూపరింటెండెంట్గాని, ఇటు డీహెచ్, ఇతర ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి రికార్డులను మాయం చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఎంఆర్టీని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలంటూ పెద్ద ఎత్తున ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడంతో సదరు అధికారి యథేచ్చగా తన కార్యకలాపాలను సాగించడంతో పాటు వస్తున్న ఆరోపణలపై ఎప్పటికప్పుడు రికార్డులను మార్చివేస్తున్నట్లు తెలుస్తోంది.
రికార్డులు తారుమారు చేసే యత్నం..!
ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ రికార్డు టెక్నీషియన్ తన సర్వీస్ బుక్లో కీలక అంశాలను మార్చడానికి శుక్రవారం యత్నించినట్లు తెలిసింది. తప్పుడు మెడికల్ ఇన్వాల్యుయేషన్ సర్టిఫికెట్లను సృష్టించడమే కాకుండా నకిలీ సర్టిఫికెట్తో పదోన్నతి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఆర్టీ తన సర్వీస్ రికార్డ్ బుక్లో ఇంటర్మీడియట్కు సమానమైన విద్యార్హతను పొందుపర్చడంతో పాటు ఆ విద్యను అభ్యసించేందుకు అనుమతి పొందినట్లుగా తప్పుడు సమాచారాన్ని పాత తేదీలతో పొందుపరిచేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది.
ఇందుకు కొందరు సంబంధిత అధికారులు సైతం సహకరించడమే కాకుండా ఈ అక్రమాల నుంచి తప్పించుకునే మార్గాలను సైతం సూచిస్తున్నట్లు సమాచారం. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఆర్టీని ఉస్మానియా దవాఖాన నుంచి బదిలీ చేయాలని, లేకపోతే అతడు రికార్డులన్నీ మాయం చేయడం లేదా తారుమారు చేసి ఆధారాలు లేకుండా చేసే అవకాశాలున్నాయని, ఇప్పటికే అలాంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరిగినట్లు దవాఖాన వర్గాలు చెబుతున్నాయి. అయితే సదరు అధికారిపై ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకుంటుందా లేక అతడికి సహకరించి, ఆరోగ్యశాఖలో అవినీతి, అక్రమాలను పెంచి పోషిస్తుందా
వేచి చూడాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

