ప్రీ లాంచ్ పేరుతో రూ. 900 కోట్ల మోసం
ప్రీ లాంచ్ ఆఫర్‌తో వేలాది మంది వద్ద నుంచి లక్షలు వసూలు చేసి రూ. 900 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డ సాహితి ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణాలు చేపట్టకముందే తక్కువ ధరకు గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్లు ఇస్తామంటూ ఈ మోసానికి పాల్పడ్డాడు
- సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్
సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రీ లాంచ్ ఆఫర్‌తో వేలాది మంది వద్ద నుంచి లక్షలు వసూలు చేసి రూ. 900 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డ సాహితి ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణాలు చేపట్టకముందే తక్కువ ధరకు గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్లు ఇస్తామంటూ ఈ మోసానికి పాల్పడ్డాడు. జాయింట్ సీపీ గజరావు భూపాల్ కథనం ప్రకారం.. సాహితి ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అమీన్పూర్లో 23 ఎకరాలలో సాహితీస్ శ్రావణి ఎలైట్ పేరుతో 38 అంతస్థులతో హైరేంజ్ అపార్టుమెంట్లు కడుతున్నానంటూ ప్రచారం చేసుకున్నాడు. 1200 చదరపు అడుగుల నుంచి 1700 చదరపు అడుగులలో డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్‌లు కట్టిస్తామంటూ చెప్పుకున్నాడు.
ఇతని ప్రీ లాంచ్ ఆఫర్ ప్రకటనలు చూసి 1700 మంది ముందుకొచ్చారు, వారి నుంచి రూ. 539 కోట్లు వసూలు చేశాడు. ఒప్పందం ప్రకారం ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో బాధితులు లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చారు. అయితే చెల్లించిన డబ్బుతో పాటు 15 నుంచి 18 శాతం సంవత్సరానికి వడ్డీ కలిపి ఇస్తానంటూ మరోసారి బాధితులకు మాట ఇచ్చి, చెక్కులను అందజేశాడు. అవి కూడా బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితులు ఈ మోసంపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అరెస్ట్ చేశారు. కాగా రెండు తెలుగు రాష్ర్టాలలో సాహితి ఇన్ఫ్రా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి సాహితి ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.
మరిన్ని మోసాలు..
సాహితీస్ శ్రావణి ఎలైట్, సాహితి ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా పలు రకాలైన పేర్లతో వివిధ ప్రాంతాలలో నిందితుడు ప్రాజెక్ట్‌లు ప్రారంభించారు. ఇలా సీసీఎస్‌లో నమోదైన కేసుతో కలిపి సుమారు 2,500 మంది కస్టమర్ల నుంచి రూ. 900 కోట్ల వరకు ఆయా ప్రాజెక్టుల పేరుతో నిందితుడు వసూలు చేశాడు. ఇతనిపై ఇతర ప్రాంతాలలోను కేసులున్నాయి. ప్రజలు ఇలాంటి ప్రీ లాంచ్ ఆఫర్ల జోలికి వెళ్లి మోసాల బారిన పడవద్దని జాయింట్ సీపీ సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- arrest
- fraud
- Hyderabad
- pre launch
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

