రాగల మూడు రోజుల్లో హైదరాబాద్‌లో వర్షాలు..!
Northeast monsoon | ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. రాగల మూడు రోజుల్లో హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి
హైదరాబాద్ : ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. రాగల మూడు రోజుల్లో హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నవంబర్ 4వ తేదీ వరకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాయంత్రం, రాత్రి సమయాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం మధ్యాహ్నం నగరం వ్యాప్తంగా తేలికపాటి వర్షం కురిసింది. 4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాబోయే మూడు రోజుల్లో కనిష్ఠంగా 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, గరిష్ఠంగా 28 నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

