సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లు లు కురిశాయి. ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడంతో రాగల మరో రెండు రోజు లు గ్రేటర్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 30.7.. కనిష్ఠ ఉష్ణోగ్రత 23.3 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 67 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.