48 గంటల్లో వర్ష సూచన
పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు చేరువకావడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 41.0, కనిష్ఠం 29.7 డిగ్రీలు, గాలిలో తేమ 31 శాతంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రాగల 48 గంటల్లో గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి, సాయంత్రం లేదా రాత్రి వేళలో వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

