Rain Alert | హైదరాబాద్‌లో ఆదివారం పలుచోట్ల వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్, మూసాపేట, బాచుపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, షాపూర్‌నగర్, చింతల్, జగద్గిరిగుట్ట, మల్కాజ్‌గిరిలో వర్షం కురుస్తున్నది. వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. మరో వైపు రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.