ఉత్సాహంగా ఫ్రీడం రన్
భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వజ్రోత్సవాలకు వన్నె తెస్తున్నారు. శనివారం సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయం నుంచి కొత్తపేట చౌరస్తా వరకు పాఠశాలల విద్యార్థులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, ఉద్యోగులతో కలిసి ఫ్రీడం రన్‌ను నిర్వహించారు. సర్కిల్ కార్యలయం వద్ద ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా
- కనుల పండువలా వజ్రోత్సవాలు
- వందలాదిగా తరలివచ్చిన యువతీయువకులు
- భారీ పతాకాలతో ప్రదర్శనలు
- పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్ జోన్‌బృందం, ఆగస్టు 13: భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వజ్రోత్సవాలకు వన్నె తెస్తున్నారు. శనివారం సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయం నుంచి కొత్తపేట చౌరస్తా వరకు పాఠశాలల విద్యార్థులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, ఉద్యోగులతో కలిసి ఫ్రీడం రన్‌ను నిర్వహించారు. సర్కిల్ కార్యలయం వద్ద ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, రంగారెడ్డి జిల్లా డీఎస్డీవో వెంకటేశ్వర్రావు, సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఉద్యోగులు, విద్యార్థులు జాతీయ పతాకాలను చేతబూని నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ఈ ర్యాలీలో డీపీవో విక్రాంత్‌రెడ్డి, సరూర్‌నగర్ హైస్కూల్ ఉపాధ్యాయుడు రాఘవరెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


- నాగోల్ డివిజన్ పరిధి జైపురికాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ గౌరవ అధ్యక్షుడు ఎస్ఆర్ గంగాధర్, అధ్యక్షుడు శ్యామల యాదగిరి, ఉపాధ్యక్షులు శంకర్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాహుల్ పోతాని, సంయుక్త కార్యదర్శులు కస్తూరి అశోక్, కె.ఆదిలాల్ తదితరులు పాల్గొన్నారు.
- సహారాస్టేట్స్ కాలనీ సమీపంలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీకి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
- కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ అధికార బృందం, ఆలయ పాలకమండలి బృందం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ శర్మ, ఆలయ పాలక మండలి చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, ఆలయ ధర్మకర్త చేగోని మల్లేశ్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, మధుసాగర్ ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
- వజ్రోత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పోచమ్మగడ్డ బస్తీలో శనివారం ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్ మహిళా వింగ్ అధ్యక్షురాలు శాగ రోజారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గోకుల్ సరోజ, గౌని అనుసూయ గౌడ్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గౌరీదేవీరాజు, యూత్ వింగ్ అధ్యక్షుడు రవిముదిరాజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, నాయకులు రమాదేవి, రజని, డాక్టర్ రాధిక, వసంత గోపాల్ ముదిరాజ్, మేక సురేందర్‌రెడ్డి, సామ శ్రీధర్‌రెడ్డి, నిష్కాంత్రెడ్డి, గూడూరు గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- లోటస్ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వనస్థలిపురం సీఐ కోలా సత్యనారాయణ విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించి ఫేజ్-4 మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లచ్చిరెడ్డి, నవజీవన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నాయకులు సంరెడ్డి భుజంగరెడ్డి, పాఠశాల డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, మంజుల తదితరులు పాల్గొన్నారు.
- పనామా చౌరస్తా నుంచి కాంప్లెక్స్ గాంధీ విగ్రహం వరకు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కదిలారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంట్లూర్ వెంకటేశ్‌గౌడ్, చాపల శ్రీనివాస్ యాదవ్, మధు, భరత్‌గౌడ్, పరమేశ్, రవికుమార్, జ్ఞానేశ్వర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- బీఎన్‌రెడ్డినగర్ వైదేహినగర్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాలనీ ప్రధాన కార్యదర్శి పోగుల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
- టీఆర్ఎస్ హయత్‌నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌లోని పలు కాలనీల్లో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. శనివారం హయత్‌నగర్ డివిజన్లోని రాఘవేంద్రనగర్, భాగ్యలత కాలనీ, అరుణోదయనగర్ కాలనీల్లో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలతో నినాదాలు చేస్తూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, టీఆర్ఎస్ డివిజన్ కమిటీ ప్రధాన కార్యదర్శి యానాల కృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు అంజలి గౌడ్, నాయకులు భాస్కర్ సాగర్, కాటెపాక స్కైలాబ్, కోట రవీందర్‌రెడ్డి, గణపురం కృష్ణ, గణేశ్, రాజూనాయక్, మధు ముదిరాజ్, గోవర్ధన్ నాయక్, బాలూనాయక్, యూసఫ్, లక్పతి, అబ్దుల్ ఖదీర్, కాలనీవాసులు బాదం శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, సూర్య ప్రకాశ్, మురళి, సత్యనారాయణ మూర్తి, లక్ష్మీనారాయణ, శంకర్, రాజు, శివ, వెంకట్‌రెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- టీఆర్ఎస్ పార్టీ బంజారాకాలనీ, అంబేద్కర్‌నగర్ కాలనీల అధ్యక్షుడు గోవర్ధన్ నాయక్ ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు గూగులోతు బాలూనాయక్, రాజూనాయక్, ఈసుభాయ్, మోహన్ నాయక్, సేవ నాయక్, మాడుగుల వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

