Ramagiri Swarika | జూనియర్ సివిల్ జడ్జీగా పాతబస్తీ బిడ్డ రామగిరి స్వారిక
తెలంగాణ జుడీషియల్ సర్వీస్ 2023 సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఎగ్జామినేషన్‌లో పాతబస్తీ, అంబికానగర్‌కు చెందిన రామగిరి శ్రీనివాసాచారి, శ్రీలత దంపతుల కుమార్తె స్వారిక అద్భుతమైన ప్రతిభను కనబర్చి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు.
Ramagiri Swarika | చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 14: తెలంగాణ జుడీషియల్ సర్వీస్ 2023 సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఎగ్జామినేషన్‌లో పాతబస్తీ, అంబికానగర్‌కు చెందిన రామగిరి శ్రీనివాసాచారి, శ్రీలత దంపతుల కుమార్తె స్వారిక అద్భుతమైన ప్రతిభను కనబర్చి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. చిన్ననాటి నుంచి చదువులో రాణించే స్వారిక సోదరుడు చంద్రకాంత్ సహకారంతో సూక్ష్మ కళా ఖండాలు గీయడంలో తెలంగాణలోనే ఘన కీర్తిని ఆర్జించారు.
ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఆమె గవర్నర్ నుంచి ప్రత్యేకంగా అవార్డును అందుకోవడంతో పాటు ప్రశంసలు పొందారు. చదువులో ఎంబీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన స్వారిక రెండేళ్లుగా తెలంగాణ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం కష్ట పడ్డారు. ఆగస్టులో నిర్వహించిన ప్రిలిమినరీ, అక్టోబర్‌లో నిర్వహించిన మెయిన్ ఎగ్జామ్స్‌లో అర్హత మార్కులు సాధించింది. డిసెంబర్లో హైకోర్టు న్యాయమూర్తుల అధ్యక్షతన నిర్వహించిన ఇంటర్వ్యూలో న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి ఈ నెల 8న జూనియర్ జడ్జీగా ఎంపికయ్యారు. తెలంగాణ సివిల్ జడ్జికి సంబంధించి కేవలం 8 పోస్టులు మాత్రమే ఉన్నప్పటికి స్వారిక రాణించి జడ్జిగా ఎంపిక కావడం విశేషం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

