అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి జైలు
యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి కోర్టు 8 రోజుల జైలుశిక్ష విధించింది. ఎస్ఐ తేజ్యానాయక్ కథనం ప్రకారం.. మూసారాంబాగ్ సుందరం అపార్ట్మెంట్లో నివాసముంటున్న యువతి ఆదివారం రాత్రి అదే ప్రాంతంలోని మరో అపార్ట్మెంట్లో నివాసముంటున్న తన సోదరి దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా, మూసారాంబాగ్ కట్టెలమండి ప్రాంతానికి చెందిన బి.మధు(27) యువతిని వెంబడించాడు.
మలక్పేట, జూన్ 8: యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి కోర్టు 8 రోజుల జైలుశిక్ష విధించింది. ఎస్ఐ తేజ్యానాయక్ కథనం ప్రకారం.. మూసారాంబాగ్ సుందరం అపార్ట్మెంట్లో నివాసముంటున్న యువతి ఆదివారం రాత్రి అదే ప్రాంతంలోని మరో అపార్ట్మెంట్లో నివాసముంటున్న తన సోదరి దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా, మూసారాంబాగ్ కట్టెలమండి ప్రాంతానికి చెందిన బి.మధు(27) యువతిని వెంబడించాడు.
దీంతో భయంతో యువతి పెరుగెత్తింది. అయినప్పటికీ వదలని దుండగుడు, పరుగెత్తి యువతిని పటుకొని అసభ్యంగా ప్రవర్తించటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ తేజ్యానాయక్ నిందితుడిపై కేసు నమోదు చేసి, సరైన ఆధారాలతో సోమవారం ఏడో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎం.భాస్కర్ ముందు హాజరుపర్చగా, నేరం రుజువు కావటంతో 8 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

