Shakti scheme | శక్తి స్కీమ్, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకు ఉదృతమవుతున్నది. తాజాగా యూసఫ్ గూడా స్టేట్ హోమ్ వద్ద గల దుర్గాబాయి దేశముక్ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శక్తి స్కీమ్ లో తమను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.