మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ కేసు.. ఆ మూడు అకౌంట్లను గుర్తించిన పోలీసులు
హైదరాబాద్: మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కీలక అప్డేట్స్ను పోలీసులు వెల్లడించాడు.

సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన 3 ఖాతాలు పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో ఇద్దరిని ఇప్పటికే ప్రశ్నించారు. సర్వర్ హ్యాక్తో ఇద్దరికీ సంబంధం లేదని పోలీసులు తేల్చారు. వినోద్, నవీన్ ఖాతాల్లో సైబర్ నేరగాళ్లు నగదు జమ చేశారు. ఇద్దరి ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా జమచేశారు. ఆ తర్వాత ఇద్దరి ఖాతాల నుంచి నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. ఇక.. షానవాజ్ ఖాతాలో రూ.6.9 కోట్లు జమ చేశారు.
షానవాజ్ ఖాతా నుంచి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. అయితే.. షానవాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తన కోసం పోలీసులు గాలిస్తున్నారు. షానవాజ్ ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నారు. షానవాజ్ కొన్ని నెలల క్రితం ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. సైబర్ క్రిమినల్స్కు షానవాజ్ సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 ఖాతాల నుంచి రూ.12.4 కోట్లు 128 ఖాతాలకు నేరగాళ్లు బదిలీ చేశారు. మరో 200 ఖాతాలకు నగదు బదిలీ కావచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు. బ్యాంకు ఖాతాల పరిశీలనకు రెండు రోజుల్లో పోలీసులు కోల్కతా వెళ్లనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

