ఆ కమిషనరేట్ వెరీ హాట్ గురూ..
రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకమైన ఓ పోలీస్ కమిషనరేట్ పోస్టింగ్‌కు పలువురు అధికారులు తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నారనే అంశంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ నడుస్తోంది. అక్కడ కమిషనర్ వచ్చి 6 నెలలు కూడా కాలేదు, ఎందుకు ఈ చర్చ? కొత్తగా ఆ సీటును దక్కించుకోవడానికి జరుగుతున్న తెర వెనుక అసలు కథేంటీ?
- ప్రతిష్ఠాత్మకంగా మారిన సదరు పోలీస్ కమిషనరేట్ పోస్టింగ్
- కమిషనర్ పోస్టు కోసం పెద్ద సంఖ్యలో పైరవీలు, ఒత్తిళ్లు
- రాజకీయం జోక్యం ఎక్కువవడంతో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత కమిషనర్
సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకమైన ఓ పోలీస్ కమిషనరేట్ పోస్టింగ్‌కు పలువురు అధికారులు తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నారనే అంశంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ నడుస్తోంది. అక్కడ కమిషనర్ వచ్చి 6 నెలలు కూడా కాలేదు, ఎందుకు ఈ చర్చ? కొత్తగా ఆ సీటును దక్కించుకోవడానికి జరుగుతున్న తెర వెనుక అసలు కథేంటీ? ప్రస్తుతం పోలీస్ వర్గాలలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఆ పోస్టింగ్ కోసం కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దలను కలిసి తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం.
ఆ పోస్టు నాకు కావాలంటే… నాకు కావాలంటూ ఎవరి ప్రయత్నాలు వాళ్లు గట్టిగా చేస్తున్నారని సమాచారం. సమర్ధవంతంగా పనిచేస్తున్నా… ఎందుకీ రూమర్స్? ప్రస్తుత కమిషనరేట్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న కమిషనర్ సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఆయన ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేశారు, ఆయన ట్రాక్ రికార్డు క్లీన్‌గా ఉంది. వచ్చిన కొత్తలో ఆయన కింద పనిచేసే అధికారుల అత్యుత్సాహంతో బదిలీల విషయంలో కొంత వివాదం చోటు చేసుకుంది. ఎలాంటి వివాదాలు లేకుండా ప్రస్తుతం సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారు, ఆయినప్పటికీ గత కొన్ని రోజులుగా ఆ స్థానం నుంచి ఆయన తప్పుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక వైపు కమిషనర్ పనితీరు బాగున్నప్పటికీ పోలీస్ వర్గాలలో ఈ తరహా రూమర్స్ రావడం, కొందరు అధికారులు ముందస్తుగానే ప్రభుత్వ పెద్దలను కలవడం వెనుక ఉన్న అసలు కారణాలు ప్రశ్నార్ధకంగా మారాయి.

Commissionerate
ఆయనకు ఇష్టం లేదనే టాక్…!
రూమర్స్ అన్నీ సదరు కమిషనర్ చేసిన కొన్ని అంతర్గత వ్యాఖ్యల నుంచే మొదలయ్యాయని డిపార్టుమెంట్లో గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అత్యంత ప్రాధాన్యత కల్గిన ఆ కమిషనరేట్‌లో బాధ్యతలు చేపట్టేందుకు పలువురు అధికారులు తమ రాజకీయ బలంతో పోటీపడుతుంటారు. కానీ ఆ కమిసనర్ ఆ ప్రాధాన్యత పోస్టును తేలికగా తీసుకోవడం, ఆయనకు అలాంటి పోస్టు తీసుకోవడం ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కీలకమైన పోస్టును తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ పెద్దలు ఆయనను కోరారని, కానీ అప్పుట్లో ఆయన దానికి అంత సుముఖత చూపలేదని తెలుస్తోంది.
ఆ తర్వాత రెండేళ్లు గడిచాక ప్రభుత్వం ఆయనకు ఆ కమిషనరేట్ బాధ్యతలు అప్పగించింది. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల తరువాత కమిషనరేట్‌లోని ఇన్స్పెక్టర్లు, ఎస్సైల బదిలీల విషయంలో రాజకీయ జోక్యం, కిందిస్థాయి అధికారుల జోక్యం పెరగడంతో ఆయన అసహనానికి గురయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితులలో నాకు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదు అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద తన ఆవేదనను పంచుకున్నట్లు డిపార్టుమెంట్లో ప్రచారం సాగుతోంది. ఈ వ్యాఖ్యలు కాస్తా బయటకు పొక్కడంతోనే ఇతర అధికారులు ఆ ఖాళీ కాబోయే పోస్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లే కారణమా..?
అసలు ఆ ఉన్నతాధికారి నిజంగానే ఆ మాటలు అన్నారా? లేక దీని వెనుక మరేదైన రాజకీయం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికారికి ప్రభుత్వ పెద్దలతో ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి, పైగా ఎలాంటి క్లిష్టమైన బాధ్యతలనైనా సమర్ధవంతంగా ఎదుర్కొన్న బ్యాగ్రౌండ్ ఆయనకుంది. అలాంటిది అక్కడి నుంచి ఆయన ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పోలీస్ సిబ్బందిలో అంతర్గతంగా మరో చర్చ కూడా నడుస్తోంది. కమిషనరేట్ పరిధిలోని కొన్ని కీలక వ్యవహారాల్లో తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆయనపై ఒత్తిళ్లు వస్తున్నట్లు టాక్. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం ఇష్టం లేక, ఆ ఒత్తిళ్లకు తలొగ్గడం కంటే అక్కడి నుంచి గౌరవంగా బదిలీపై వెళ్లిపోవడమే మేలని ఆయన భావిస్తున్నారా? అందుకు ఇంతటి అయిష్టత ప్రదర్శిస్తున్నారా? అని సిబ్బంది మాట్లాడుకుంటున్నారు.
సీటు కోసం పోటీ..!
ఈ పరిణామాలను గమనించిన ఇతర ప్రాంతాలలో పనిచేసే పోలీస్ కమిషనర్లతో పాటు ఇతర విభాగాల కీలకమైన పోస్టులలో పనిచేస్తున్న అధికారులు ఆ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా ఆ స్థానాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. మరికొందరు తాము గతంలోనే ఈ పోస్టు వస్తుందని భావించాం, కాని మీరు ఇవ్వలేదు, ఇప్పుడైనా అవకాశం కల్పించండంటూ ఉన్నతాధికారులను కోరుతున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనలపై సదరు పెద్దలు కాస్త గట్టిగానే స్పందించినట్లు తెలుస్తోంది, ముందు మీకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా చేయండి, అక్కడ పనితీరు మెరుగు పరుచుకోండి… ఆ తరువాతే వేరే పోస్టింగ్‌ల గురించి ఆలోచించండంటూ చురకలు అంటించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక వైపు ప్రస్తుత కమిషనర్ అయిష్టత, మరో వైపు ఆ సీటు కోసం ఇతర అధికారుల ముమ్మర ప్రయత్నాలు, ప్రభుత్వ పెద్దల వద్ద సాగుతున్న పైరవీలతో ఈ వ్యవహారం పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

