Hyderabad
- Dec 01, 2020 , 07:59:57
అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారు

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రెండు రోజుల క్రితం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో కేసీఆర్ ఈ నెల 7నుంచి వరద సాయం కొనసాగిస్తామని ప్రకటించడమే అందుకు నిదర్శనం అన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా, హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి సాధించాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కల్పించే పార్టీలకు కాకుండా అభివృద్ధి చేసే పార్టీనే ప్రజలు ఆదరిస్తారని నవీన్కుమార ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
MOST READ
TRENDING