గ్రేటర్లో ప్రగతి విజయం
పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్ధికి బాటలు వేసింది పట్టణ ప్రగతి. ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారంతో 15 రోజుల పాటు (జూన్ 3వ తేదీ నుంచి 18వరకు) నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ప్రజా సమస్యల పరిషారానికి ఎంతో దోహదపడింది
ఉత్సాహంగా ముగిసిన పట్టణ ప్రగతి
1,11,797 టన్నుల చెత్త తొలగింపు.. పచ్చదనానికి అధిక ప్రాధాన్యం
పరిశుభ్రతకు ప్రాధాన్యం.. నగరాభివృద్ధికి బాటలు
సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్ధికి బాటలు వేసింది పట్టణ ప్రగతి. ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారంతో 15 రోజుల పాటు (జూన్ 3వ తేదీ నుంచి 18వరకు) నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ప్రజా సమస్యల పరిషారానికి ఎంతో దోహదపడింది. పారిశుధ్యం, పచ్చదనం మెరుగు పడింది. రోజువారీ చెత్త సేకరణ లక్ష్యం కంటే అదనంగా సేకరణ చేసి.. తక్షణమే డంపు యార్డుకు తరలించేందుకు అవసరమైన వాహనాలు సమకూర్చింది జీహెచ్ఎంసీ. కాలనీ, బస్తీవాసులు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తేవడంతో అధికారులు సమస్య పరిషారానికి విశేష కృషి చేశారు. ఎంటామాలజీ శాఖ అధికారులు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడంతో పాటు దోమలు ఉత్పత్తి అయ్యే ప్రదేశాల్లో పిన్ పాయింట్ ప్రోగ్రాం నిర్వహించి ఫాగింగ్, స్ప్రేయింగ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సరిళ్లలోని 150 వార్డుల్లో ఇప్పటి వరకు 5,900 కాలనీలు, బస్తీల్లో పట్టణ ప్రగతి విజయవంతంగా సాగింది.
పరిశుభ్రంగా మార్చి..
పట్టణ ప్రగతిలో గ్రేటర్ పరిధిలో మొత్తం 1,11,797 టన్నుల చెత్తతోపాటు 36,131.9 టన్నుల నిర్మాణ వ్యర్థాలను , 22.94.58 కిలోమీటర్ల రోడ్డు పకన ఉన్న ముళ్ల పొదల తొలగించారు. 273 కిలోమీటర్ల మేర పూడికతీత పనులు చేశారు. 88 శిథిలావస్థలో ఉన్న ఇండ్ల వ్యర్థాలను తొలగించారు. 163 లోతట్టు ప్రాంతాల్లో పూడ్చారు. దోమల నివారణకు 56,775 ప్రాంతాల్లో ఫాగింగ్, స్ప్రేయింగ్ చేశారు. 1183 మంచినీటి ట్యాంక్‌లు, పరిసరాలను శుభ్రం చేశారు. 960 పారులు, 1425 కమ్యూనిటీ స్థలాలు, ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ భవన సముదాయాలను, 17266 మరుగుదొడ్లను పరిశుభ్రం చేశారు. 575 వైకుంఠధామాలు/ శ్మశానవాటికల్లో ఉన్న వ్యర్థాలను తొలగించారు. 16,93,448 ఇండ్లలో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టారు. 16,78,158 ఇండ్లలో ఫాగింగ్ నిర్వహించారు. పచ్చదనంలో భాగంగా 71,556 మొకలు నాటారు. 18,053 మీటర్ల రోడ్డు మధ్యలో (మీడియన్ ప్లాంటేషన్) మొకలు నాటడంతో పాటు 28.12 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేశారు. 1,13,540 ఇండ్లకు మొకలను పంపిణీ చేశారు. 14.57 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. 74,425 మొకలకు సాసర్ చేసి, కలుపు తీశారు. పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు గ్రీనరీ అభివృద్ధికి కృషి చేసిన 24 జంటలకు సన్మానించారు.
పట్టణ ప్రగతిలో ఆదివారం చేపట్టిన కార్యక్రమాలు
- పారిశుధ్యం
- చెత్త 7,214 మెట్రిక్ టన్నులు .. భవన నిర్మాణ వ్యర్థాలు 2,072 మెట్రిక్ టన్నులు తొలగింపు
- 144 కిలోమీటర్ల మేర రోడ్డు పకన ఉన్న ముళ్లపొదల తొలగింపు
- 11 కిలోమీటర్ల పరిధిలో డ్రైనేజీ/ నాలాలో పూడికతీత పనులు
- 8 శిథిల భవనాల వ్యర్థాల తొలగింపు
- 1597 ప్రాంతాల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్
- 9 మంచినీటి ట్యాంక్‌లు, 62 పార్కులు, 84 కమ్యూనిటీ స్థలాలు, ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ భవన సముదాయాల పరిశుభ్రం
- 1114 మరుగుదొడ్లు శుభ్రం చేశారు
- 39 వైకుంఠధామాలు/ శ్మశానవాటికల్లో ఉన్న వ్యర్థాలను తొలగించారు.
ఎంటమాలజీ
- 1,44,176 ఇండ్లలో యాంటీ లార్వా చర్యలు
- 1,31,986 లక్షల ఇండ్లల్లో ఫాగింగ్.
గ్రీనరీ
- 3911 మొకలు నాటారు
- 689 మీటర్లు రోడ్డు మధ్యలో (మీడియన్ ప్లాంటేషన్) మొకలు నాటడంతో పాటు కిలోమీటర్ మార్గంలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు.
- 9,008 ఇండ్లకు మొకల పంపిణీ
- కిలో మీటర్ మార్గంలో మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్.
- 4298 మొకలకు సాసర్ చేసి, కలుపు తీశారు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

