Private Hostels | పని చేయని సీసీ కెమెరాలు.. లేని సెక్యూరిటీ గార్డులు.. ప్రైవేట్ హాస్టళ్లలో భద్రత డొల్ల
ప్రైవేట్ హాస్టళ్లలో భద్రత కరువవుతున్నది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నది. పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పలు హాస్టళ్లను పోలీసులు తనిఖీలు చేపట్టగా, డొల్లతనం బయటపడింది. అనేక హాస్టళ్లలో పని చేయని సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డు వ్యవస్థ, హాస్టళ్లలో చేరే వారి పేర్లు సరిగా లేకపోవడం, దానికి సంబంధించిన రిజిస్టర్లను నిర్వహించకపోవడాన్ని పోలీసులు గుర్తించారు.
- పని చేయని ‘సీసీ’లు.. డీవీఆర్లు
- సెక్యూరిటీ గార్డులు లేకుండానే నిర్వహణ
Private Hostels | ఖైరతాబాద్, ఆగస్టు 5 : ప్రైవేట్ హాస్టళ్లలో భద్రత కరువవుతున్నది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నది. పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పలు హాస్టళ్లను పోలీసులు తనిఖీలు చేపట్టగా, డొల్లతనం బయటపడింది. అనేక హాస్టళ్లలో పని చేయని సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డు వ్యవస్థ, హాస్టళ్లలో చేరే వారి పేర్లు సరిగా లేకపోవడం, దానికి సంబంధించిన రిజిస్టర్లను నిర్వహించకపోవడాన్ని పోలీసులు గుర్తించారు.
పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్, సీఐ శోభన్ నేతృత్వంలో 25 మంది సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే వివిధ హాస్టళ్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తుండడంతో పాటు మరికొన్నింటిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే పలు డ్రగ్స్ విక్రయ ముఠాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు సైతం వినిపించాయి. దీంతో పోలీసులు ప్రైవేట్ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
పని చేయని సీసీ కెమెరాలు
పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో గతంలో అనేక చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఓ సెల్‌ఫోన్ సైతం అపహరణకు గురికాగా, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలను పట్టుకునేందుకు నానా తంటాలు పడ్డారు. నెల రోజుల కిందట పోలీస్ అధికారులు..సుమారు 250 మంది హాస్టళ్ల యాజమాన్యాలను పిలిపించి.. నిబంధనలను పాటించాలంటూ.. స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా..ఏ ఒక్క హాస్టల్ యజమాని కూడా నిబంధనలను పాటించడం లేదన్న విషయం తాజా తనిఖీల్లో వెలుగు చూశాయి. సోమవారం అమీర్‌పేటలోని హ్యాపీ హోమ్స్, కావూరి మెన్స్ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించగా, సీసీ కెమెరాల వ్యవస్థ లేదు. ఉన్న కెమెరాలు పనిచేయకపోవడంతో పాటు దానిని భద్రపరిచే డీవీఆర్ పనిచేయడం లేదు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 250కి పైగా ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నాయి. గతంలోనే ఆయా హాస్టళ్లను పరిశీలించిన పోలీసులు వారికి నోటీసులు సైతం జారీ చేశారు. అయినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. తాజాగా జరిగిన తనిఖీల్లో సెక్యూరిటీ గార్డులే కనిపించలేదు. ఒక్క హాస్టల్లో కూడా సరైన సెక్యూరిటీ వ్యవస్థ లేదు. రాత్రి వేళల్లో హాస్టళ్ల వద్ద లైట్లు సైతం వెలుగడం లేదు. దీంతో తరచూ దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. హాస్టళ్లలో చేరే వారి సమాచారం కూడా యాజమాన్యాల వద్ద లేకపోవడాన్ని గుర్తించారు. కొందరి ఆధార్ కార్డులు సైతం అస్పష్టంగా ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా నడిచే హాస్టళ్లపై చర్యలు
పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో 250 హాస్టళ్లు నడుస్తున్నాయి. అందులోచాలా హాస్టళ్లు సరైన నిబంధనలు పాటించడం లేదన్న విషయం మా దృష్టికి వచ్చాయి. దొంగతనాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులందాయి. ఇప్పటికే పలు హాస్టళ్ల యాజమాన్యాలకు నోటీసులు సైతం పంపించాం. సోమవారం జరిపిన తనిఖీల్లో సీసీ కెమెరాలు, ఫుటేజీల బ్యాకప్, సెక్యూరిటీ గార్డుల వ్యవస్థ లేకపోవడాన్ని గుర్తించాం. త్వరలోనే వారందరికీ నోటీసులు పంపించి కఠిన చర్యలు తీసుకుంటాం.
– మోహన్ కుమార్, ఏసీపీ పంజాగుట్ట
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

