హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) జూబ్లీహిల్స్లో (Jubilee hills) కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన మహింద్రా జైలో (టీఎస్07యూఎఫ్7436) కారు.. అదుపుతప్పి డివైడర్ (Divider) పైకి దూసుకెళ్లింది. దీంతో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ను దవాఖానకు తరలించారు. ఓవర్ స్పీడ్, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. కాగా, రోడ్డుపై ట్రాఫిక్ అంతగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.