హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్‌పై (Tank Bund) కారు బోల్తాపడింది. శనివారం ఉదయం ట్యాంక్‌బండ్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు (TS08 EZ 3990) అదుపుతప్పి ఎన్టీఆర్ గార్డెన్ వద్ద బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు వైద్య విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాంధీ దవాఖాన నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారును రోడ్డుపైనుంచి తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.