Shamshabad | శంషాబాద్ విమానాశ్రయం రోడ్డులో డివైడర్ను ఢీకొని పల్టీలుకొట్టిన కారు..
శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad airport) రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్ను (Divider) ఢీకొట్టి పల్టీలుకొట్టింది (Car accident). అయితే సమయానికి ఎయిర్ బెలూన్లు (Air Balloons) తెరచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad airport) రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్ను (Divider) ఢీకొట్టి పల్టీలుకొట్టింది (Car accident). అయితే సమయానికి ఎయిర్ బెలూన్లు (Air Balloons) తెరచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారులో నుంచి వారిని బయటకు తీసి దవాఖానకు తరలించారు.
ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉన్నారని, వారిలో ఒకరు బెంగళూరు (Bengaluru) వెళ్తున్న ప్రయాణికుడని చెప్పారు. ప్రదమ చికిత్స అనంతరం అతడిని మరో కారులో విమానాశ్రయానికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

