ఆధునికతను అందిపుచ్చుకునేలా..
విద్యా, పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాలలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను మెరుగు పరుచుకునే దిశగా ఉస్మానియా యూనివర్సిటీ ఆధునిక నిర్ణయాలు తీసుకుంటున్నది.
- టెక్నాలజీలో నైపుణ్యాల మెరుగుకు ఓయూ కృషి
- ఓయూ విద్యార్థులకు అవగాహన కోసం ప్రత్యేక చర్యలు
- ఇప్పటికే జపాన్ వర్సిటీలను సందర్శించిన ఓయూ విద్యార్థులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : విద్యా, పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాలలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను మెరుగు పరుచుకునే దిశగా ఉస్మానియా యూనివర్సిటీ ఆధునిక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన యూనివర్సిటీలు అందుబాటులోకి తీసుకువస్తున్న విద్యా అవకాశాలు, వసతుల పట్ల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులకు ప్రత్యేక అవగాహన కల్పించే దిశగా యూనివర్సిటీ అవసరమైన చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే పలు దేశాలలోని యూనివర్సిటీలు, విద్యా సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకున్న ఓయూ.. జపాన్‌కు చెందిన విద్యా సంస్థ శిబౌరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఐటీ)లో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
ఈ క్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్‌యాదవ్, స్టూడెంట్ ఎఫైర్ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్ నేతృత్వంలో సామాజిక శాస్ర్తాలు, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌తో పాటు ఆయా విభాగాలకు చెందిన పది మంది విద్యార్థులు కూడా టోక్యో పర్యటనకు వెళ్లి వచ్చారు. కొత్త ఆలోచనలకు జపాన్‌లోని టోక్యో పర్యటన ఎంతగానో తోడ్పడిందని విద్యార్థులను తమ అనుభవాలను వెలిబుచ్చారు..
నియమాలు పాటించడం ఎలాగో తెలుసుకున్నాం..
ఓయూ వీసీ ఆధ్వర్యంలో తాను టోక్యోలోని ఎస్ఐటీ సందర్శించడానికి తనకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ ప్రజలు, వారి ఆతిథ్యం, సంస్కృతి ఎంతో అద్భుతంగా ఉంది. సమయపాలన పాటించడం, ఓపికగా ఉండడంతో పాటు ఎవరూ మనల్ని చూడనప్పటికీ అన్ని నియమాలు పాటించడం ఎలాగో నేర్చుకున్నాను. అలాగే సూపర్ కండక్టర్ల సాంకేతికత గురించి కూడా ఎంతో తెలుసుకున్నాను.
– పి నిఖిత, ఓయూ, సివిల్ ఇంజినీరింగ్, ద్వితీయ సంవత్సరం
మనో ధైర్యాన్ని నింపింది..
జపాన్ పర్యటన తనకెంతో మనో ధైర్యాన్ని నింపింది. ఈ పర్యటన వల్ల జపాన్‌లోని విజ్ఞాన సౌధాన్ని స్వయంగా చూడగలిగాను. మేము ఎస్డీజీ13 పై ఒక సెమినార్ కూడా చేశాం. ఇదే అంశంపై సహచరుల ఆలోచనలు తెలుసుకున్నాం. దీని ద్వారా ప్రపంచంలోని సమస్యలను వేరే కోణంలో చూసే అవకాశం దక్కింది.
– కడారి మైత్రేయి, ఎమ్మెస్సీ, భూగర్భ శాస్త్రం
టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం..
జపాన్ సకురా ఇండక్షన్ ప్రోగ్రామ్‌లో మమ్మల్ని ఎంపిక చేసినందుకు ఓయూకు ఎంతో రుణపడి ఉంటాను. సూపర్ కండక్టర్ రంగంలోని వివిధ సాంకేతిక పురోగతుల గురించి జ్ఞానాన్ని పొందే అవకాశం లభించింది.
– కోట శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్, ఓయూ
జపాన్ను సందర్శించాలి..
వివిధ మార్గాలలో భవిష్యత్తును అన్వేషించడానికి ఈ పర్యటన తనకెంతో అవకాశాన్నిచ్చింది. ఈ విషయంలో ఓయూ, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ క్రమంలో (‘ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్’), ఎక్స్ఆర్డీ వంటి ఆధునిక పరికరాల పట్ల అవగాహన వచ్చింది. జపాన్ సందర్శించి, అక్కడి ప్రజల సంస్కృతి, ఆతిథ్యాన్ని పొందాలని సూచిస్తున్నాను.
– దుండే శ్రీరామ్ వివేక్ వర్మ, ఈసీఈ
అవగాహన పెంచుకున్నాం..
జపాన్‌లో పిబౌర యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి సాంకేతిక సంబంధ విషయాన్ని చాలా అవగాహన పెంచుకున్నాను. సాంకేతిక పరికరాలను అక్కడి అధ్యాపకులు చక్కగా విశ్లేషించారు. అక్కడి భారతీయ రాయబారి శిబి జార్జ్ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.
– కార్తీక్ తామల్లు, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ద్వితీయ సంవత్సరం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- OU
- skills
- technology
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

