ఉస్మానియా విద్యా సమాచారం

బీపీఈడీ, డీపీఈడీ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫలితాలను ఇప్పటికే విడుదల చేసినట్లు చెప్పారు. రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకున్న టీఎస్ ఆన్లైన్ కేంద్రాలలో ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత రుసుము చెల్లించాలని సూచించారు. జవాబు పత్రం నకలు పొందగోరే వారు ఈ నెల 30వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.
ఓయూ పరిధిలో బీఈ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని బ్రాంచీల బీఈ ఎనిమిదో సెమిస్టర్ మేకప్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 16వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు.
ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరిలో నిర్వహించిన బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ, హియరింగ్ ఇంపెయిర్మెంట్, లర్నింగ్ డిసేబిలిటీ) మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో పొందుపరిచినట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

