172 మందికి వెట్టి నుంచి విముక్తి

సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): తక్కువ కూలీ.. ఎక్కువ పని గంటలతో పిల్లలను పిండేస్తున్న యజమానులపై రాచకొండ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన డ్రైవ్‌లో 172 మంది మైనర్లను వెట్టి చాకిరీ నుంచి కాపాడారు. రాచకొండ పోలీసులు 18 కేసులు నమోదు చేసి, 37 మందిని అరెస్టు చేశారు. వీరిలో 19 మంది భిక్షాటన చేస్తున్న వారిని కూడా పోలీసులు రక్షించి, సంక్షేమ కేంద్రాలకు తరలించారు. కాపాడిన 172 మందిలో 88 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉండగా, 84 మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారున్నారు. వీరిలో నేపాల్‌కు చెందిన ఓ మైనర్ కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
రక్షించిన ప్రతి మైనర్‌ను విచారించగా, ఆర్థిక ఇబ్బందులే కారణమని చెబుతున్నారు. తల్లిదండ్రులు పంపించడం వల్లే భిక్షాటన చేస్తున్నామని కొంతమంది చెబుతుండగా, ఆకలి బాధను తీర్చుకునేందుకు భిక్షాటన చేస్తున్నామని మరికొందరు చెప్పారు. రాచకొండ షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, రాచకొండ పోలీసులు వీరందరినీ సంక్షేమ శిబిరాలకు తరలించారు. వారి తల్లిదండ్రులు, బంధువుల సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. తల్లిదండ్రులను గుర్తించి ఈ మైనర్లను సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) అధికారుల సమక్షంలో అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులు, ఎవరూ లేకపోతే వారిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పజెబుతామని పేర్కొన్నారు. మైనర్లతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

