Prajavani | ప్రజావాణికి స్పందన అంతంతే!.. మళ్లీ డుమ్మా కొట్టిన మేయర్
దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుందని ఎంతో ఆశగా ప్రజావాణికి వస్తున్న వారికి నిరాశే మిగులుతున్నది. ప్రజా సమస్యలను స్వీకరించి పరిష్కరించి.. అర్జీదారుల్లో భరోసా నింపాల్సిన అధికారులు..కంటి తుడుపు చర్యగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
- ప్రజావాణికి ఆదరణ కరువు
- సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో ప్రజల్లో అనాసక్తి
Prajavani | సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ)/మేడ్చల్ కలెక్టరేట్: దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుందని ఎంతో ఆశగా ప్రజావాణికి వస్తున్న వారికి నిరాశే మిగులుతున్నది. ప్రజా సమస్యలను స్వీకరించి పరిష్కరించి.. అర్జీదారుల్లో భరోసా నింపాల్సిన అధికారులు..కంటి తుడుపు చర్యగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వీకరించిన దరఖాస్తులకు పరిష్కారం చూపడం లేదు. ఫలితంగా ప్రజావాణిపై నమ్మకం లేకనే కార్యక్రమంపై ఫిర్యాదుదారులు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అంతంత మాత్రమే స్పందన కనిపించింది. కేవలం 32 ఫిర్యాదులను మాత్రమే అధికారులు నేరుగా స్వీకరించారు.
అర్జీదారులు లేకపోవడంతో కమిషనర్ ఆమ్రపాలి ప్రజావాణి నుంచి త్వరగానే వెళ్లిపోయారు. ఈసారి సైతం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజావాణికి డుమ్మా కొట్టారు. మరోవైపు ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించాలని కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న ఆమె.. నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి విజ్ఞప్తులను కమిషనర్ స్వీకరించారు. ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జాప్యం లేకుండా ప్రజావాణిలో వచ్చిన విన్నపాలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. కాగా, ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 32 విన్నపాలు రాగా, టెలిఫోన్ ద్వారా మరో 11 విన్నపాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
వచ్చిన దరఖాస్తుల్లో 15 టౌన్‌ప్లానింగ్, ట్రాన్స్‌పోర్టు ఒకటి, సీవీఓ/రెవెన్యూ రెండు, సీఎం అండ్ హెచ్ఓ రెండు, స్పోర్ట్స్ రెండు, ఇంజినీరింగ్ మెయింటెనెన్స్ మూడు, వెటర్నరీ 2, జలమండలి రెండు, ఎస్టేట్స్ ఒకటి, హౌసింగ్ రెండు విన్నపాలు వచ్చినట్లు తెలిపారు. ఆరు జోన్లలో ప్రజావాణి నిర్వహించగా..81 దరఖాస్తులను స్వీకరించారు. కూకట్పల్లి జోన్లో అత్యధికంగా 42, శేరిలింగంపల్లిలో 20, చార్మినార్‌లో 8, సికింద్రాబాద్‌లో 7, ఎల్బీనగర్లో ఒకటి, ఖైరతాబాద్‌లో మూడు అర్జీలను అధికారులు స్వీకరించారు. అదనపు కమిషనర్లు శ్రీవాస్తవ, నళిని పద్మావతి, సత్యనారాయణ, చంద్రకాంత్‌రెడ్డి, సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్, సీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పద్మజ, ఎస్ఎన్డీపీ ఎస్ఈ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
108 దరఖాస్తుల్లో 73 డబుల్ ఇండ్ల కోసమే..
డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలంటూ హైదరాబాదీలు కలెక్టరేట్‌కు పోటెత్తుతున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో అత్యధికంగా వీటికి సంబంధించినవే ఎక్కువ సంఖ్యలో వినతి పత్రాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో 108 దరఖాస్తులు రాగా.. ఇందులో 73 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులు కావడం విశేషం. కాగా, ఇప్పటి వరకు హైదరాబాద్‌లో వేలల్లో డబుల్ బెడ్రూంలకు సంబంధించి దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్పారు. దీంతో గృహ నిర్మాణ శాఖలో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. తమ దరఖాస్తుపై అధికారులు స్పందించడం లేదని ప్రతి సోమవారం ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి గృహనిర్మాణ శాఖ అధికారుల వద్ద వాపోతున్నారు. డబుల్ బెడ్రూంలకు సంబంధించి ఆదేశాలు వచ్చిన తర్వాత సమాచారం తెలియజేస్తామని దరఖాస్తుదారులను వెనక్కి పంపిస్తున్నారు. వర్షాలు భారీగా కురుస్తుండటంతో సరైన ఇల్లు లేని వారందరూ ఇప్పుడు డబుల్ బెడ్రూంల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
మేడ్చల్‌లో..
ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో 75 దరఖాస్తులు వచ్చాయి. అలాగే నాగారం మున్సిపల్ కార్యాలయంలో 2, దమ్మాయిగూడలో జరిగిన ప్రజావాణిలో 6 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
గ్రేటర్లో దోమల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. దోమలు వృద్ధి చెందకుండా వాటి ఉత్పత్తి ప్రదేశాల్లో గంబూషియా, ఆయిల్ బాల్స్ వేయాలని ఆదేశించారు. దోమల నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, వర్షాకాలంలో డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్, డయోరియా, విష జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్య సేవలు అందించాలని, ఎకడైనా మలేరియా, డయేరియా, డెంగీ వంటి వ్యాధి సోకితే, అలాంటి ప్రాంతాల్లో నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా శానిటేషన్ సవ్యంగా జరిగేలా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

