రవీంద్రభారతి, మే 21: ఆన్లైన్ ద్వారా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఫరెవర్ ఫెంటాస్టిక్ థియేటర్స్ (2ఎఫ్టీ) ఆధ్వర్యంలో సినిమా దర్శకత్వ నిర్మాణంలో ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకుడు, సినీ దర్శకుడు, నిర్మాత డాక్టర్ ఖాజాపాష ఓ ప్రకటనలో తెలిపారు. 9 వారాల పాటు శని, ఆదివారం సాయంత్రం 6.30 నుంచి 10.30 గంటల వరకు ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ రంగస్థల నిపుణులతో పాటు సినీ రచయితలు, అనుభవం ఉన్న దర్శకులతో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహించబోయే 9వారాల శిక్షణ శిబిరానికి పుణె ఫిలిం ఇనిస్టిట్యూట్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల శిక్షణతో పాటు సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్, ఫీజు వివరాలకు 9346645411, 98489 49827 నంబర్లకు వాట్సాప్ చేయాలని తెలిపారు.