ఆన్లైన్ ట్రేడింగ్ కేసులో మరో ముగ్గురు అరెస్టు

ఆన్లైన్ ట్రేడింగ్‌తో భారీ లాభాలు ఆర్జించి మీకు ఇస్తామంటూ నమ్మించి నగరానికి చెందిన ఓ మహిళకు రూ. 1.2 కోట్లు టోకరా వేసిన ముఠాలోని మరో ముగ్గురు నిందితులను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. గత ఏడాది నవంబరు 19న అబిడ్స్‌కు చెందిన ఓ మహిళకు ఫేస్బుక్లో ‘సాక్షి మెహెత’ పేరుతో పరిచయం అయిన మహిళ తాము షేర్ ట్రేడింగ్ బిజినెస్ కన్సల్టెంట్ అంటూ చెప్పుకుంది.
తాము షేర్ మార్కెట్ వ్యాపారంతో సెంట్రల్ ట్రేడింగ్ రిసర్చ్ కూడా చేస్తుంటామని, మా కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉందంటూ చెబుతూ బాధితురాలిని నమ్మించి దఫదఫాలుగా రూ. 1.2 కోట్లు కాజేశారు. బాధితురాలు ఈ ఏడాది మార్చి 1న సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ హరిభూషణ్ నేతృత్వంలోని ఎస్సై కృష్ణ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటనలో వారం రోజుల కిందట మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ సిరస్వాల్ అలియాస్ రాహుల్, మహేశ్ దేవ్లను అరెస్ట్ చేశారు. తాజాగా తరుణ్ ప్రజాపతి, బబ్లూ చౌహాన్, సందీప్ బన్సోద్‌లను అరెస్ట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- fraud
- Online Trading
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

