ప్రజల చేతుల్లో.. హోటల్స్ రేటింగ్
హైదరాబాద్ మహానగరంలో ఉన్న రెస్టారెంట్స్‌కు పరిశుభ్రతలో రేటింగ్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఇటీవల కాలంలో పలు రెస్టారెంట్లపై నిర్వహించిన దాడుల నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)ఈ నిర్ణయం తీసుకుంది.
- రెస్టారెంట్ల యాజమాన్యాలకు జవాబుదారీతనం పెరగాలి
- పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు కమిటీ
- ఇటీవల తనిఖీల్లో సమస్యలు గుర్తింపు
- హైదరాబాద్ రెస్టారెంట్స్‌కు రేటింగ్ ఇవ్వాలని నిర్ణయం
- ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఏఐ
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరంలో ఉన్న రెస్టారెంట్స్‌కు పరిశుభ్రతలో రేటింగ్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఇటీవల కాలంలో పలు రెస్టారెంట్లపై నిర్వహించిన దాడుల నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లకు హైజీన్ రేటింగ్స్ ఇవ్వాలని, తద్వారా జవాబుదారీతనం పెంచడానికి ఈ చొరవ దోహదం చేస్తుందని ఎన్ఆర్ఏఐ ప్రతినిధి తెలిపారు.
ఎన్ఆర్ఏఐ హైదరాబాద్ చాప్టర్ హెడ్ సంపత్ తుమ్మల అధ్యక్షతన 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇది నగరం అంతటా ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాల అమలును నిర్ధారిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు త్వరలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చాప్టర్ ప్రతినిధి తెలిపారు. ఎన్ఆర్ఏఐ టాస్క్‌ఫోర్స్ బృందం వర్క్‌షాపులు, శిక్షణ కార్యక్రమాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పరిశుభ్రతపై నిర్వాహకులకు అవగాహన కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రతా విభాగం టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీల సమయంలో వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రత విషయంలో చాలా సమస్యలను గుర్తించిన నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలను ఎన్ఆర్ఏఐ చేపట్టిందని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

