ఉరేసుకొని తొమ్మిదేండ్ల బాలిక ఆత్మహత్య
ఉరేసుకొని తొమ్మిదేండ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మార్కెట్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కనకయ్య కథనం ప్రకారం.. సికింద్రాబాద్ టకారబస్తీకి చెందిన వివాహితకు ఇద్దరు కూతుళ్లు సుదీక్ష, సమీక్ష (9). కుమారుడు రికేశ్ ఉన్నారు. సమీక్ష గత 15 రోజులుగా స్కూల్కు
బేగంపేట, ఆగస్టు 11: ఉరేసుకొని తొమ్మిదేండ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మార్కెట్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కనకయ్య కథనం ప్రకారం.. సికింద్రాబాద్ టకారబస్తీకి చెందిన వివాహితకు ఇద్దరు కూతుళ్లు సుదీక్ష, సమీక్ష (9). కుమారుడు రికేశ్ ఉన్నారు. సమీక్ష గత 15 రోజులుగా స్కూల్కు వెళ్లడం లేదు.
గురువారం ఉదయం పెద్ద కూతురు సుదీక్షను పాఠశాలకు పంపించిన తల్లి.. చిన్నకూతురు సమీక్షను, కొడుకు రికేశ్ను ఇంటిలోనే ఉంచి.. బయట తాళం వేసి పనికి వెళ్లింది. 11 గంటల సమయంలో ఇంటిలో నుంచి రికేశ్ ఏడుస్తూ కిటికీ తలుపులు తెరిచాడు. బాలుడి ఏడుపు విన్న స్థానికులు.. ఇంటి వద్దకు వచ్చి కిటికీలో నుంచి చూడగా సమీక్ష సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. స్థానికులు వెంటనే మార్కెట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సమీక్ష మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Girl
- hangs
- Hyderabad
- Nine year old
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

